‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా నేడు(ఫిబ్రవరి 15) ఉదయం 11:11 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శకుడు అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేశాడు. ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపామని.. టీజర్ నచ్చితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే అవుతుందంటూ ఓ సుదీర్ఘమైన లేఖను విడుదల చేశాడు.
ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుని ఆశీస్సులతో మా చిత్రానికి సంబంధించిన వరల్డ్ ఆఫ్ నాగబంధం ఫస్ట్ టీజర్‌ను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ చిత్రం కేవలం రాసుకున్న కథ కాదు, ఏ చరిత్ర పుస్తకాల్లోనూ రాయని గాథ. ఈ కథను పూర్తిగా తెలుసుకొని రాయడానికి ఏన్నో నెలలు పట్టింది. ఈ కథ పూర్తిగా రాసిన తరువాతే ఊపిరిపీల్చుకోగలిగాము. ఈ కథను తెరపై ఎక్కించడానికి ఎన్నో నిశ్చబ్దాలను ఎదుర్కొంటూ, ఎన్నో నిద్రలేని రాతుల్రను గడిపాము.
ఒక దర్శకుడిగా చెప్పాలంటే..ఈ టీజర్ అనేది విజువల్ మాత్రమే కాదు. అది మా ఊపిరిలో దాగిఉన్న శ్వాస. చాలాకాలం మా అంతరాత్మలో దాచుకొని మీ ముందుకు నిజంలా తీసుకొస్తున్న తొలి దృశ్యరూపం. మీరు చూసే ప్రతీ ఫ్రేమ్‌లోనూ మా కష్టం ఉంది. అది మీకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మాకు ఈ కథపై నమ్మకం, సనాతన ధర్మంపై విశ్వాసం, సినిమాపై ఉన్న ప్రేమే మా మార్గానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది.
అలసిపోయిన రాత్రులు గడిపాము, ప్రశ్నలతో నిండిన రోజులు చూశాం. అయినా మేము ఆ ప్రశ్నల లోతులోకి తొంగి చూసి, వాటిని ఛేదిస్తూ ముందుకు సాగాము. కథను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దామో, అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని నమ్ముతున్నాము. ఆ మహాదేవునిపై ఉన్న దైవభక్తి మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించింది.
మా ప్రయాణానికి వెన్నంటే ఉంటూ వెన్నెముకగా నిలిచిన మా నిర్మాతలు నిషిత, కిషోర్ గ్లారకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారు చూపించిన స్నేహపూర్వకమైన నమ్మకమే నా ధైర్యం. వారు నాకు చ్చిన ప్రోత్సాహమే నా బలం. ఇక మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, రానా దగ్గుబాటి గారి ప్రోత్సాహం, ఆశీర్వాదాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను. రాతల్లో రాయలేను.
మేము కోరుకునేది ఒక్కటే స్వచ్ఛమైన మనస్సుతో ఈ టీజర్‌ను వీక్షించండి. మీ మనస్సును తాకితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే. చివరిగా మీరు చూపించే ఆదరణే మా ఆయుధం. ఆ ఆయుధమే ఈ చిత్ర విజయానికి బాటలు వేసేలా చేస్తుందని భావిస్తున్నా’ అని అభిషేక్ నామా రాసుకొచ్చాడు.
"#NAGABANDHAM IS NOT JUST ANOTHER MOVIE."
With a heart filled with the deepest gratitude to everyone who supported me on this unforgettable journey,
I am bringing the WORLD OF NAGABANDHAM before you at 11:11 AM.
Let’s celebrate our history.
Let’s celebrate our Sanatana Dharma.… pic.twitter.com/s0q3Lil6TJ— ABHISHEK PICTURES (@AbhishekPicture) February 15, 2026


