పెళ్లి చేసుకోకుండానే తండ్రినయ్యా.. ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా! | Tushar Kapoor Becomes Single Father Through IVF And Surrogacy, Chooses Parenthood Over Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇష్టం లేదు, తండ్రవ్వాలని మాత్రం కోరిక! అందుకే..: బాలీవుడ్‌ నటుడు

Feb 14 2026 4:55 PM | Updated on Feb 14 2026 5:04 PM

Tusshar Kapoor Recalls becoming Single Dad through IVF, Surrogacy Journey

యవ్వనం కొవ్వొత్తిలా కరిగిపోయినా సరే.. కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోనని మొండిగా కూర్చున్నాడు ప్రముఖ నటుడు జితేంద్ర కుమారుడు, నటుడు తుషార్‌ కపూర్‌. అయితే పెళ్లికి విరుద్ధమే కానీ, తండ్రవడానికి కాదని సింగిల్‌ పేరెంట్‌ అయ్యాడు. పెళ్లి చేసుకోకుండా ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా తండ్రయిన తొలి బాలీవుడ్‌ సెలబ్రిటీగా గుర్తింపు పొందాడు. తాజాగా ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.

అక్కడే నేర్చుకున్నా..
తుషార్‌ కపూర్‌ మాట్లాడుతూ.. మా నాన్నలాగే నేను కూడా పాతకాలం మనిషిని. కాకపోతే ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు కాస్త భిన్నంగా ఉండేవి. ఐదేళ్లు అమెరికాలో ఉండటం వల్ల ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నాను. పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఓ బిడ్డకు తండ్రయ్యాను. మా నాన్న అలా కాదు. తను పెళ్లిని గౌరవిస్తాడు. కుటుంబ బంధాలను నమ్ముతాడు.

40 ఏళ్లకు తండ్రినయ్యా..
నేను కాస్త మొహమాటస్తుడినే. ఎక్కువగా బయట కూడా తిరగను. అయితే ఒక పిల్లవాడిని పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. 40 ఏళ్ల వయసులో తండ్రయ్యాను. తండ్రవడానికి అదే సరైన సమయం అని భావిస్తాను. మన సమాజం మాత్రం 25 ఏళ్లకే పెళ్లి, పిల్లలు అని గోల మొదలుపెడుతుంది. నేను కూడా పెళ్లిని గౌరవిస్తాను, నమ్ముతాను. కానీ ఎందుకో అది నాకు సూటవదనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకోలేదు.

ఆ జర్నీ వల్లే..
39 ఏళ్ల వయసులో ఓసారి తిరుపతికి వెళ్లాను. అప్పుడే నటుడు, నిర్మాత ప్రకాశ్‌ జాను కలిశాను. తిరుపతి నుంచి తిరుగుప్రయాణం అయ్యేటప్పుడు మా విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇద్దరం కాసేపు కూర్చుని కాలక్షేపం చేశాం. అప్పుడే అతడో మాటన్నాడు. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ సింగిల్‌ పేరెంట్‌ అవొచ్చుగా.. అదొకసారి ఆలోచించు అన్నాడు. అతడి కుటుంబంలో ఒక అమ్మాయి ఇలాగే సింగిల్‌ పేరెంట్‌ అయిందని తెలిపాడు.

సినిమా
వెంటనే నాక్కూడా ఓ బిడ్డ కావాలనిపించింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పటికప్పుడు అన్నీ తెలుసుకుని, ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఏదీ ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు. చివరకు ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా తండ్రినయ్యాను అని తుషార్‌ చెప్పుకొచ్చాడు. తుషార్‌ కపూర్‌.. ముజే కుచ్‌ కెహ్నా హై, గాయబ్‌, గోల్‌మాల్‌, గోల్‌మాల్‌ రిటర్న్స్‌, షోర్‌ ఇన్‌ ద సిటీ, ద డర్టీ పిక్చర్‌, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'వెల్‌కమ్‌ టు ద జంగిల్‌' మూవీ చేస్తున్నాడు.

చదవండి: సూర్య-జ్యోతిక ప్రేమను ఒప్పుకోని హీరో తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement