కొడుకు, కోడల్ని అభినందించిన చిరంజీవి | Chiranjeevi Appreciates Ram Charan, Upasana Over their Twins Names | Sakshi
Sakshi News home page

Chiranjeevi: నా మనసును కదిలించారు.. ఎంతో గర్వంగా ఉంది!

Feb 14 2026 1:13 PM | Updated on Feb 14 2026 1:31 PM

Chiranjeevi Appreciates Ram Charan, Upasana Over their Twins Names

కవల పిల్లల రాకతో మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులకు మూడేళ్ల క్రితం కూతురు క్లీంకార పుట్టగా ఈ ఏడాది జనవరి 31న కవలలు (బాబు, పాప) జన్మించారు. వీరికి ఫిబ్రవరి 11న బారసాల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు మెగా, కామినేని కుటుంబసభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. 

అర్థవంతమైన పేర్లు
కుమారుడికి శివరామ్‌ కొణిదెల అని, కుమార్తెకు అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు. ఈ రోజుల్లో పిల్లలకు నోరు తిరగని పేర్లు పెడుతున్నారు. ఎంత వెరైటీగా ఉంటే అంత బాగుంటుందని ఆలోచిస్తున్నారు. కానీ రామ్‌చరణ్‌ దంపతులు మాత్రం ఆధ్యాత్మిక భావనకు పెద్ద పీట వేస్తూ మంచి అర్థవంతమైన పేర్లు పెట్టారు. ఈ విషయంపై తమను చాలామంది అభినందిస్తున్నారంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

కొడుకు-  కోడల్ని అభినందించిన చిరంజీవి
స్నేహితులు, బంధువులు, అభిమానులు... ఇలా అందరూ కవలల పేర్లు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో చరణ్‌, ఉపాసనను అభినందించాల్సిందే! ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా, దేవుడి ఆశీర్వాదం లభించేలా ఎంతో పవిత్రమైన పేర్లను ఎంచుకున్నారు. అందుకు నాకెంతో గర్వంగా ఉంది. మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది.

ముందు తరాలకు మార్గనిర్దేశం
భక్తి, సంస్కృతి మేళవించిన ఈ పేర్లు ముందు తరాలకు మార్గనిర్దేశం చేసేలా ఉన్నాయి. అలాగే చరణ్‌.. అతడి నానమ్మ అంజనాదేవి పేరు వచ్చేలా కూతురికి అన్వీరా 'దేవి' పేరు పెట్టడం నా మనసును కదిలించింది. చరణ్‌, ఉపాసనతో పాటు మీ పిల్లలకు కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అని పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్‌కు ఉసాపన.. లవ్యూ మామయ్య అని కామెంట్‌ పెట్టింది.

 

 

చదవండి: రాజాసాబ్‌లో డూప్‌.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement