‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Couple Friendly Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Feb 14 2026 8:18 AM | Updated on Feb 14 2026 9:17 AM

Couple Friendly Movie Review And Rating In Telugu

టైటిల్‌ : కపుల్‌ ఫ్రెండ్లీ
నటీనటులు: సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి, యోగిబాబు, రాజీవ్‌ కనకాల, గోపరాజు రమణ తదితరులు
నిర్మాణ సంస్థ:యూవీ కాన్సెప్ట్స్
సమర్పణ: యూవీ క్రియేషన్స్‌
రచన, దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్
సంగీతం: ఆదిత్య రవీంద్రన్‌
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
విడుదల తేది: ఫిబ్రవరి 14, 2026

సంతోష్‌ శోభన్‌.. ప్రతిభ గల నటుడు. కానీ ఆయన ఖాతాలో భారీ హిట్‌ అనేదే లేదు. ‘ఏక్‌ మినీ కథ’ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ‘కపుల్‌ ప్రెండ్లీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా సంతోష్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడా? ఫీల్‌ గుడ్‌ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం

కథేంటంటే..
నెల్లూరుకు చెందిన శివ..ఓ బడ్డింగ్‌ ఆర్కిటెక్ట్‌. ఉద్యోగం కోసం  చెన్నై వస్తాడు. ఏళ్లు గడిచినా ఆయనకు సరైన ప్రాజెక్టు దొరకదు. దీంతో డైలీ ఖర్చుల కోసం బైక్‌ పూలింగ్‌ చేస్తుంటాడు. అలా మిత్ర(మానన వారణాసి) అనే అమ్మాయి బైక్‌ రైడ్‌లో పరిచయం అవుతుంది. చిత్తూరుకు చెందిన మిత్ర.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం చెన్నై వస్తుంది. శివలాగే ఆమె కూడా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓ కారణంగా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురురించి.. లివింగ్‌ రిలేషన్‌ని కొనసాగిస్తారు. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వీరిద్దరి జీవితంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది. అదేంటి? శివ, మిత్ర ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. మిత్ర రాకతో శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరకు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. 

 ఎలా ఉందంటే.. 
జీవిత ప్రయాణం ఎప్పుడు ఎలా ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. రేపటి గురించి ఆలోచించకుండా..ఈ క్షణం మనల్ని ప్రేమించిన వాళ్లతో సంతోషంగా గడుపుతూ.. కొన్ని మధుర జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి.. కపుల్‌ ఫ్రెండ్లీ సినిమా ద్వారా ఇచ్చిన మంచి సందేశం ఇది. సంభాషలతో కాకుండా కథ రూపంలో ఈ సందేశాన్ని ఇచ్చారు దర్శఖుడు. సినిమా కథ చాలా సరదాగా ప్రారంభమై.. ఎమోషనల్‌గా ముగుస్తుంది.  కథనం నెమ్మదిగా సాగినా... ఎక్కడ బోర్‌ కొట్టదు. అనుకోకుండా పరిచమై.. ప్రేమలో పడి..పెళ్లికి ముందు హద్దులు దాటి.. చివరకు పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో ఓ షాకింగ్‌ విషయం తెలియడం.. ఆ ఆర్వాత వీరిద్దర ప్రయాణం ఎలా కొనసాగింది? అనేది తెరపై చాలా మెచ్యూర్డ్‌గా చూపించాడు దర్శకుడు.

హీరో బ్రేకప్‌ సీన్‌తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ చెన్నైకి వెళ్తుంది. అక్కడ ఉద్యోగం కోసం శివ పడే ఇబ్బందులను చూపిస్తూనే మరోవైపు మిత్ర పాత్రను పరిచయం చేశారు. ఇద్దరూ కలిసినప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మిత్ర సహాయంతో శివ చేతికి ప్రాజెక్టులు రావడం..తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం.. ఈ ప్రయాణంలో మిత్రతో ప్రేమలో పడడం.. ఇదంతా రొమాంటిక్‌గా సాగుతుంది. ప్రథమార్థం కాస్త నెమ్మదిగా సాగినా.. బోర్‌ మాత్రం కొట్టదు. ఇక సెకండాఫ్‌ మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమాలోని ట్విస్ట్‌ తెలిసిన తర్వాత మనకు గీతాంజలి, ఓయ్‌, సాగరసంగమం లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. సినిమా ప్రారంభంలో చూపించే కేరళ సీన్ల వెనుక ఉన్న అసలు స్టోరీ ద్వితియార్థంలోనే తెలుస్తుంది. క్లైమాక్స్‌ ఊహకందేలా సాగుతుంది.

ఎవరిలా చేశారంటే.. 
శివ పాత్రలో సంతోష్‌ శోభన్‌ జీవించేశాడు. ఎక్కడ అతి చేసినట్లుగా అనిపించదు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. మిత్రగా మానస తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. సంతోష్‌, మానసల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. మిగతా పాత్రలన్ని ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి అంతే. యోగి బాబు ఉన్నా..కామెడీ పండించే స్కోప్‌ లేదు. హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్‌ ఫాదర్‌గా రాజీవ్‌ కనకాల తెరపై కనిపించేదేది కాసేపే అయినా.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆదిత్య రవీంద్రన్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్‌ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:
Advertisement
 
Advertisement
Advertisement