– అనిల్ రావిపూడి
సంతోష్ శోభన్ , మానస వారణాసి జోడీగా నటించిన సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు రిలీజ్ అవుతోంది. నిర్మాత– డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ–‘‘సంతోష్ మంచి పెర్ఫార్మర్. సహజంగా యాక్ట్ చేస్తాడు’’ అన్నారు.
‘‘ఈ సినిమా ట్రైలర్ చూడగానే, మూవీ హిట్ అనిపించింది’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్‌తో ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ‘‘ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరచదు’’ అన్నారు అశ్విన్ చంద్రశేఖర్. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం ఇది’’ అని చెప్పారు ధీరజ్ మొగిలినేని. దర్శకులు మేర్లపాక గాంధీ, అభిలాష్ రెడ్డి, నందినీ రెడ్డి, నిర్మాత స్వప్నదత్ అతిథిలుగా పాల్గొని ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ విజయం సాధించాలని ఆకాంక్షించారు.


