ముద్దు సీన్లు.. ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడ్డారు: మానస వారణాసి | Manasa Varanasi Opens About Romantic Scenes Of Couple Friendly Movie | Sakshi
Sakshi News home page

ముద్దు సీన్లు.. ట్రైలర్‌ చూసి ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడ్డారు: మానస వారణాసి

Feb 12 2026 5:21 PM | Updated on Feb 12 2026 5:37 PM

Manasa Varanasi Opens About Romantic Scenes Of Couple Friendly Movie

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యువత ఈ ట్రైలర్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. దానికి కారణం అందులో ఓ ముద్దు సీన్‌ కూడా చూపించడం. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయంటోంది హీరోయిన్‌ మానన వారణాసి. కథ చెప్పినప్పుడే తనకు ముద్దు సీన్ల గురించి చెప్పారని.. టీమ్‌పై నమ్మకంతో ఓకే చెప్పానని అంటోంది. అయితే ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఇంట్లో వాళ్లు ఆ సీన్లను చూసి ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా మానస వారణాసినే చెప్పింది. 

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాలోని ముద్దు సీన్ల గురించి మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో సన్నిహితంగా ఉండే సన్నివేశాలు ఉంటాయి. కథ చెప్పినప్పుడే ఇది లవ్ స్టోరీ రెండు ముద్దు సీన్స్ ఉంటాయని చెప్పారు. మొదట్లో నేను సందేహించాను. కానీ మా డీవోపీ, డైరెక్టర్, హీరో సంతోష్..ఇలా టీమ్ అంతా ప్రొఫెషనల్, హానెస్ట్ గా ఉన్నారు. వీళ్లు అసభ్యంగా సీన్స్ చేయరు అని నమ్మకం కలిగింది. 

నాకొక కంఫర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సంతోష్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ టీమ్ అంతా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తుంటే నటిగా నేనూ ప్రొఫెషనల్ గా ఉండాలి కదా అని నటించాను. రొమాంటిక్ సీన్స్ అయినా బ్యూటిఫుల్ గా పొయెటిక్ గా తెరకెక్కించారు. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక మా ఇంట్లో వాళ్లు కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు. మన వారణాసి కుటుంబంలో ఉండి ఇలా ఎలా చేశావు అన్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సపోర్ట్ చేశారు’ అని మానస చెప్పుకొచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement