సఖి, ఏ మాయే చేశావే తరహాలో ‘నిలవే’ : సింగర్‌ సునీత | Singer Sunitha Talks About Nilave Movie At Pre Release Event | Sakshi
Sakshi News home page

సఖి, ఏ మాయే చేశావే తరహాలో ‘నిలవే’ ఓ ఫీల్ గుడ్ సినిమా : సింగర్‌ సునీత

Feb 11 2026 6:09 PM | Updated on Feb 11 2026 6:14 PM

Singer Sunitha Talks About Nilave Movie At Pre Release Event

ఈ మధ్య చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలు చూస్తుంటాం. అలా అన్నీ ఎమోషన్స్ చూపించేలా ఉన్న చిత్రమే ’నిలవే‘.  అద్భుతమైన ఫొటోగ్రఫీ, దర్శకత్వం, తగిన నటీనటులు ఉన్న సినిమా ఇది. క్లాసికల్ మూవీస్ సఖి, ఏ మాయే చేశావే  తరహాలో మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందని భావిస్తున్నా’ అన్నారు సింగర్‌ సునీత. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. ఫిబ్రవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్‌ నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సింగర్‌ సునీత మాట్లాడుతూ..  ఈ సినిమా చూశాను. అర్థవంతమైన సినిమా ఇది. ఇందులోని పాటలు బాగున్నాయని ఓసారి కీరవాణిగారిని వినమంటే ఆయన విని తనవంతు సపోర్ట్ ఇస్తానని ప్రమోషన్ చేయడం కూడా సినిమా పై పాజిటివ్ నెలకొంది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి విషెస్ చెబుతున్నానని అన్నారు.

హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ..  చిన్నప్పటినుంచీ నటుడు కావాలనే కోరిక ఉండేది. అందుకు నాకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవిగారే. ఫిబ్రవరి 13న నా  తొలి సినిమా విడుదలకాబోతుంది. నిన్న ప్రీమియర్ వేశాం. అందరూ చాలా బాగుందని అభినందించారు.  రేపు ప్రేక్షకులు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. యాక్షన్ మూవీస్ లో కె.జి.ఎఫ్. ఎలా ఉందో లవ్ స్టోరీస్ లో కే జీ ఎఫ్ - నిలవే’ అన్నారు.

హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీ. లో అతి పెద్దదైన తెలుగు ఇండస్ట్రీలో నాయికగా నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా నేను అంగీకరించడానికి  సంగీతమే ప్రధాన  కారణం. డైలగ్స్ కూడా ఫీల్ కలిగేలా వున్నాయి. జంజీ  జనరేషన్ కు చెందిన మా జనరేషన్ సినిమా ఇది. ఈ సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా చేసిన టీమ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.

 ‘నాని గారు కోర్ట్ సినిమా తీశాక చూడండి నచ్చకపోతే నా తదుపరి సినిమా చూడకండి అంటూ బెట్ కూడా వేశారు. కానీ మా దగ్గర అలాంటి బెట్ లు లేవు. మా దగ్గర మంచి సినిమా ఉంది. దాన్ని మీరు చూసి ఆశీర్వదించండి. ఇందులో అందరూ కొత్తవారు కావచ్చు. అందరి కృషితో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’ అని దర్శకుడు సా కే వెన్నం అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement