యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టినా, మంచి జరిగినా, చెడు జరిగినా అన్ని అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమెకు తొమ్మిది నెలలు నిండాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
థాంక్యూ
నా చిన్న పాప లేదా బాబుకు ఈ పోస్ట్ అంకితం.. ఈ తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీ ఇంత ఆనందంగా, అందంగా, అద్భుతంగా సాగనిచ్చినందుకు థాంక్యూ.. ఒక్కరోజు లేదా ఒక్కసారి కూడా నువ్వెప్పుడూ నన్ను టెన్షన్ పెట్టలేదు. కొన్నిసార్లు అసౌకర్యానికి లోనయినప్పటికీ అది ఈ జర్నీలో భాగమే.. దాన్ని కూడా నేను ఆస్వాదించాను. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు నేను, నాన్నా నీకెప్పుడూ రుణపడి ఉంటాం.
సేఫ్ డెలివరీ
నువ్వు మంచి బిడ్డగా ఉంటావని తెలుసు. నువ్వు మా జీవితాల్లోకి వస్తుండటమే అతి పెద్ద ఆశీర్వాదం, అలాగే అద్భుతం కూడా! నిన్ను ఎప్పుడెప్పుడు పొత్తిళ్లలోకి తీసుకోవాలా? అని ఎదురుచూస్తున్నాను. ఈ 9 నెలల జర్నీలాగే డెలివరీ కూడా సేఫ్‌గా అవుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అమ్మా, నాన్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తప్పకుండా అంతా మంచే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: నాకు జరిగినట్లుగా నా కూతురికి జరగనివ్వను: రణ్‌బీర్ కపూర్


