'అప్పుడు నాకు రెండు నెలలే'.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఎమోషనల్ వీడియో | Uday Kiran niece comments about manasantha movie re release | Sakshi
Sakshi News home page

Uday Kiran: 'అప్పుడు నాకు రెండు నెలలే'.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఎమోషనల్ వీడియో

Feb 11 2026 2:38 PM | Updated on Feb 11 2026 2:51 PM

Uday Kiran niece comments about manasantha movie re release

టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ మనసంతా నువ్వే. ఈ ‍ప్రేమకథా చిత్రం మరోసారి ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది.  ఈ ఏడాది వాలైంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రీమా సేన్, తనూ రాయ్‌ హీరోయిన్లుగా నటించారు. 2001లో విడుదలైన ఈ సినిమాకు వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి,  చైతన్యా రెడ్డి, రఘురామ్‌ రెడ్డి, రవికాంత్‌ రెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఓ వీడియోను రిలీజ్ చేసింది. నేను ఉదయ్ కిరణ్ మేనకోడలు అని.. ఈ సినిమా రిలీజైనప్పుడు నాకు రెండు నెలల వయస్సు ఉంటుందని తెలిపింది. ఈ ఫిబ్రవరి 14 మీకు చాలా స్పెషల్‌గా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. మనసంతా నువ్వే మిమ్మల్ని మరోసారి థియేటర్లలో ‍అలరించనుందని పేర్కొంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాను మీ అందరితో కలిసి చూడడానికి చాలా ఆసక్తిగా ఉందంటూ మహతి వీడియోలో మాట్లాడింది. 

 ఉదయ్‌కిరణ్‌ మేనల్లుడు తేజ కూడా..

‘అంతకుముందే ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ కూడా మాట్లాడారు. 'మా మామయ్య నటించిన ఈ చిత్రం 25ఏళ్ల తర్వాత రీ-రిలీజ్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్య పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఉటుందని నేను ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్‌ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్స్‌కు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7ఏళ్లు మాత్రమే.. నేను కూడా థియేటర్‌కు వెళ్లి మూవీ చూస్తాను. కుటుంబం మొత్తం కలిసిచూడాల్సిన సినిమా అని చెబుతాను.' అంటూ తేజ ఒక వీడియో విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement