టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. ఆమె ఇన్‌స్టాలో ఏదైనా పోస్ట్ పెడితే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఆమె అందాన్ని పొగుడుతూ పలువురు నెటిజన్లు కామెంట్ కూడా చేస్తుంటారు. మరికొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా ఆమెకు ప్రపోజ్ కూడా చేస్తుంటారు. అలా తనకు వెరైటీగా వచ్చిన ఒక ప్రపోజల్ గురించి మీడియాతో పంచుకుంటి అందాల తార సుప్రీత. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘అమరావతికి ఆహ్వానం’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకొచ్చిన ఓ వెరైటీ ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చింది.
‘నాకు రెగ్యులర్‌గా ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. అయితే వాటిని నేను లైట్ తీసుకుంటా. కొన్ని మెసేజ్‌లు చూసి నవ్వుకుంటాను. ఈ మధ్య ఒకతను నా మొబైల్ నెంబర్ కోసం రూ. 20 వేలు ఖర్చు చేశాడట. నా నెంబర్ కనుకొన్ని ఆయన మెసేజ్ చేశాడు. ‘మీ నెంబర్ కోసమే నేను రూ. 20 వేలు ఖర్చు చేశాను. మీరంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి. నన్ను పెళ్లి చేసుకో.. చాలా బాగా చూసుకుంటాను. మీ నెంబర్ కోసమే అంత డబ్బు ఖర్చు చేశానంటే.. నిన్ను ఎలా చూసుకుంటానే అర్థం చేసుకో’ అని స్మార్ట్‌గా ప్రపోజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి నవ్వుకొని అతన్ని బ్లాక్ చేశా’ అని సుప్రీత చెప్పుకొచ్చింది.
ఇక తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెబుతూ.. ‘నన్ను భరించేవాడు దొరికితే చాలు. ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. అలా అని ఖాలీగా ఉండకూడదు. ఏదో ఒక బిజినెస్ చేస్తూ..ఫ్రీ టైం మొత్తం నాతోనే గడపాలి. కలిసి బయటకు వెళ్లాలి. నేనే ఎక్కువ కేరింగ్ చేస్తా. నేను వండి పెట్టింది తింటూ నాతో ఉంటే చాలు’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.


