ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ మూవీ చేశా.. హీరో నిఖిల్‌ | Nikhil Siddhartha Made Emotional Comments At Swayambhu Movie Teaser Launch Event, Read Story Inside | Sakshi
Sakshi News home page

Nikhil Siddhartha: ఒళ్లు దగ్గర పెట్టుకుని, భయపడుతూ ఈ సినిమా చేశా

Feb 11 2026 2:02 PM | Updated on Feb 11 2026 2:13 PM

Nikhil Siddhartha Comments at Swayambhu Teaser Launch Event

'కార్తికేయ 2' సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో ఘన విజయం అందుకున్న హీరో నిఖిల్‌ మరో భారీ బడ్జెట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'స్వయంభు'. బుధవారం (ఫిబ్రవరి 11న) ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ.. హ్యాపీ డేస్‌ వచ్చి 19 ఏళ్లవుతోంది. ఇది నా 22వ సినిమా.

ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశా..
ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అన్ని సమయాల్లో మీరంతా తోడున్నారు. గత రెండేళ్లుగా నేను కనిపించలేదు. కార్తికేయ 2 తర్వాత మంచి సినిమాతో మీ ముందుకు రావాలనుకున్నాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని, భయపడుతూ, జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభు. నిఖిల్‌ మావాడు అని గర్వంగా చెప్పుకునేలా ఈ మూవీ ఉంటుంది. ఎంతోమంది పోరాట యోధుల వల్లే మన దేశం ఈరోజు ఇలా ఉంది. కొన్నిసార్లు వారి గురించి మన పుస్తకాల్లో కూడా ఉండదు. వెయ్యేండ్ల కిందట జరిగిన కథ ఇది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం అని చెప్పుకొచ్చాడు.

సినిమా
స్వయంభు విషయానికి వస్తే.. నిఖిల్‌ హీరోగా నటించగా, నభా నటేశ్‌, సంయుక్త, సునీల్‌ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు పోషించారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించగా భువన్‌, శ్రీకర్‌ నిర్మించారు. రవి బస్రూర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది.

చదవండి: స్వయంభు టీజర్‌ రిలీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement