పాట పాడలేనన్న ‘ధురంధర్‌’ సింగర్‌.. నెటిజన్లు ప్రశంసలు | Dhurandhar Singer Jasmine Sandlas Objects To Men Harassing Women At Delhi concert | Sakshi
Sakshi News home page

పాట పాడలేనన్న ‘ధురంధర్‌’ సింగర్‌.. నెటిజన్లు ప్రశంసలు

Feb 11 2026 12:16 PM | Updated on Feb 11 2026 12:26 PM

Dhurandhar Singer Jasmine Sandlas Objects To Men Harassing Women At Delhi concert

అది ప్రముఖ సింగర్‌ కచేరి. వేలాది మంది తరలి వచ్చారు. ఆ సింగర్‌ తన గాత్రంతో సంగీత ప్రియుల్ని మంత్రముగ్థుల్ని చేస్తోంది. అందరూ ఆమె పాటలో లీనమైపోయారు. అంతే.. సడెన్‌గా ఆమె తన పాటను ఆపేసింది.న  ఇద్దరు యువకులను చూసిస్తూ.. వాళ్లను పంపించకపోతే పాడేదే లేదంటూ హుకుం జారీ చేసింది. ఇది చూసి అక్కడున్నవారంతా సింగర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ కూడా సదరు గాయని చేసిన పనికి ఫిదా అవుతూ.. మంచి నిర్ణయం తీసుకుందంటూ కొనియాడారు. ఇంతకీ ఆ గాయని ఎవరు?  మధ్యలోనే పాటను ఆపడానికి గల కారణం ఏంటి?

పంజాబ్‌ సింగర్‌ జాస్మిన్ శాండ్లాస్ గాత్రానికి లక్షలాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పాటలకు మిలియన్ల వ్యూస్‌ వస్తుంటాయి. ‘ధురంధర్‌’ సినిమాలో ఆమె ఆలపించిన ‘తెను షరాత్‌సికా’ పాట ఇప్పటికీ సోషల్‌ మీడియాలో హచ్‌చల్‌ చేస్తోంది. ఈ పాటకు లక్షలాది మంది రీల్స్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌లో మిలియన్‌కి పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే జోష్‌లో ఆమె తాజాగా ఢిల్లీలో సంగీత కచేరి నిర్వహించింది. ఈ కచేరీకి  వేలాది మంది సంగీత ప్రియులు వచ్చారు.

జాస్మిన్‌ పాటలను ఆలపిస్తున్న క్రమంలో.. ఇద్దరు ఆకతాయి కుర్రాళ్లు.. అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించడాన్ని ఆమె గమనించారు. వెంటనే పాటను మధ్యలో ఆపేసి.. ‘సెక్యూరిటీ.. దయచేసి అక్కడున్న ఇద్దరు అబ్బాయిలను బటయకు పంపించండి. వాళ్లు అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు. నా కచేరీలో మహిళలు సురక్షితంగా లేకుంటే.. పాడడం ఆపేస్తా’ అని ఆమె హెచ్చరించింది. 

వాళ్లను బయటకు పంపేవరకు ఆమె ఆలపించలేదు. చివరకు అక్కడి సిబ్బంది ఆ ఇద్దరి యువకులను బయటకు పంపడంతో జాస్మిన్‌ తన కచేరిని కొనసాగించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న యువకుల పట్ల ఆమె ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తనకోసం వచ్చి మహిళల రక్షణ కోసం ఆమె గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement