దురంధర్‌ హీరోకు బెదిరింపులు.. వాట్సాప్‌లో వాయిస్‌ మేసేజ్..! | Ranveer Singh Receives Threatening WhatsApp Voice Note | Sakshi
Sakshi News home page

Ranveer Singh: దురంధర్‌ హీరోకు బెదిరింపులు.. కోట్ల రూపాయల డిమాండ్..!

Feb 10 2026 8:00 PM | Updated on Feb 10 2026 8:03 PM

Ranveer Singh Receives Threatening WhatsApp Voice Note

దురంధర్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌కు బెదిరింపులొచ్చినట్లు తెలుస్తోంది. కొందరు దుండగులు వాట్సాప్ వాయిస్ చాట్ ద్వారా ఆయనను బెదిరించారు. వాట్సాప్ వాయిస్ సందేశం ద్వారా డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయం కాస్తా ముంబయి పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు ప్రారంభించారు.

తాజా బెదిరింపుల నేపథ్యంలో ముంబయిలోని రణ్‌వీర్ సింగ్‌ ఇంటి బయట భద్రతను మరింత పెంచారు. కాగా.. ఇటీవలే ముంబయిలోని జుహులో బాలీవుడ్ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్ని రోజుల వ్యవధిలోనే స్టార్‌ హీరోకు బెదిరింపులు రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో బెదిరింపు వాయిస్ నోట్ పంపిన వ్యక్తి ఎవరనే దానిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. ఇటీవల రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన దురంధర్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ బెదిరింపులపై రణ్‌వీర్‌ సింగ్‌ కానీ.. అతని టీమ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement