అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలంటే కఠినమైన రూల్స్ ఉన్నాయంటూ ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఐకాన్ స్టార్‌తో షూట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మేనేజర్స్ దాదాపు 42 నిబంధనలతో ఓ నోట్ ఇచ్చారని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై వస్తున్న ఈ కథనంపై ఆయన టీమ్ రియాక్ట్ అయింది. ఆమె చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి అవాస్తవాలను ఎవరూ కూడా నమ్మొద్దని ఐకాన్ స్టార్ టీమ్ కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేసింది. ఈ మేరకుఅల్లు అర్జున్ కార్యాలయం నుంచి అధికారిక నోట్ విడుదల చేసింది.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇలాంటి ధృవీకరించని కంటెంట్‌ను షేర్ చేయకుండా ఉండాలని సూచించింది. కాగా.. గతంలో ఆమె అల్లు అర్జున్‌తో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Unbelievable rules of Allu Arjun.
A media professional reveals some of the shocking "do's and don'ts" when meeting megastar Allu Arjun.
From strictly following a list of 42 rules to being told "don't look in sir's eyes" and "don't shake hands,"
Why someone can't look in your… pic.twitter.com/pGv9UmhhBP— lakshman (@rebel_notout) February 10, 2026


