ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంచితే అల్లు అర్జున్‌పై ప్రముఖ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆమె.. అల్లు అర్జున్‌ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కావేరి బారువా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్‌తో జరిగింది. ఈ సౌత్ స్టార్‌ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్‌కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. అలాగే షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్ బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Yeh hai Pushpa ka rule : Massive respect to @alluarjun Sir for setting strict rules before meeting any media person! North has always treated their stars like gods with endless protocols, but when South's Icon sets his own in Bombay? Suddenly it's 'too much' and shocking?… pic.twitter.com/FALbtiv1Dn
— AnandTanniru (@ceoyktv) February 10, 2026


