కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమనాలు ఎదుర్కొన్నానని, కొంతమంది దర్శకులతో బూతులు కూడా తిట్టించుకున్నానని చెబుతోంది బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన కొన్ని సంఘటలను పంచుకుంది. ‘చాలా మంది నటీనటులాకే నాకు కూడా కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురైయ్యాయి. సెట్‌లో అవమానించేలా మాట్లాడేవారు. కొంతమంది దర్శకులు కారణం లేకుండా బూతులు తిట్టేవారు. అప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. డబ్బులు కావాలి.
అందుకే వాళ్లు అసభ్య పదాలతో దూషించినా.. సైలెంట్‌గా ఉండిపోయా. కొన్ని సినిమాలు అయితే కేవలం డబ్బుల కోసమే నటించా. షూటింగ్ అయిపోయాక ఈ చిత్రాలను ఎందుకు అంగీకరించానా అని చాలా బాధపడేదాన్ని. అవి విడుదల కావొద్దని దేవుడ్ని కోరుకున్నా. అవకాశాలు రాకపోవడంతో ఆ చిత్రాలను అంగీకరించా. ఒకవేళ ఆ సమయంలో నాకు వేరే చిత్రాలు వచ్చి ఉంటే.. కొన్ని సినిమాలను వదిలేదాన్ని’ అని నీనా గుప్తా చెప్పుకొచ్చింది.
సినిమాలతో పాటు సిరియళ్లలోనూ నటించింది నీనా గుప్తా.‘ఇష్క్’, ‘ఎలోన్’, ‘ముల్క్’, ‘83’, ‘డయల్ 100’, ‘గుడ్‌బై’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా అలరించింది.


