డ్రాగన్ యాక్షన్ | NTR Dragon New Schedule Begins in Jordan | Sakshi
Sakshi News home page

డ్రాగన్ యాక్షన్

Feb 10 2026 1:00 AM | Updated on Feb 10 2026 1:00 AM

NTR Dragon New Schedule Begins in Jordan

జోర్డాన్ లో ల్యాండ్‌ అయ్యారు డ్రాగన్ . హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్ ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). రుక్మిణీ వసంత్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్‌ కపూర్, టొవినో థామస్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ జోర్డాన్  లొకేషన్స్ లో ప్రారంభం అయిందని తెలిసింది.

దాదాపు నెల పాటు జరిగే ఈ షూటింగ్‌లో ప్రధానంగా మూడు యాక్షన్  సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారట ప్రశాంత్‌ నీల్‌. ఈ సినిమాలోని ఎన్టీఆర్‌ క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని, మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డేకి ‘డ్రాగన్ ’ ఫస్ట్‌లుక్, టీజర్‌ రిలీజ్‌ కావొచ్చనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్  ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే  రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement