ఆయా షేర్‌ | Nani Epic Aaya Sher Shoot for The Paradise | Sakshi
Sakshi News home page

ఆయా షేర్‌

Feb 10 2026 12:47 AM | Updated on Feb 10 2026 12:47 AM

Nani Epic Aaya Sher Shoot for The Paradise

‘ది ప్యారడైజ్‌’ సినిమా కోసం అదిరిపోయే డ్యాన్స్  పెర్ఫార్మెన్స్  చేస్తున్నారు జడల్‌. ఏ రేంజ్‌లో అనేది సిల్వర్‌ స్క్రీన్స్ పై చూడాలి. ‘దసరా’ వంటి సూపర్‌హిట్‌ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్‌’. మోహన్‌ బాబు, రాఘవ్‌ జుయల్, సంపూర్ణేష్‌ బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

పీరియాడికల్‌ యాక్షన్  డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్‌ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నానిపై ఇంట్రో సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు. ‘ఆయా షేర్‌..’ అంటూ సాగే ఈ పాటకు సుధన్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఎనిమిది భాషల్లో ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement