మెగా ఫ్యామిలీలో ట్విన్స్‌.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్ | Ram Charan And Wife Upasana Konidela Shares Emotional Video About Her Twins, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Upasana: మెగా ఫ్యామిలీలో ట్విన్స్‌.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్

Feb 9 2026 8:42 PM | Updated on Feb 10 2026 10:48 AM

Ram charan wife Upasana Konidela Shares Emotional Video about Twins

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే కవలలకు జన్మనిచ్చింది. జనవరి 31న ఓ బాబు, పాపకు వెల్‌కమ్ చెప్పారు మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ అభిమానులు ఈ సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే తాజాగా ఉపాసన ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ట్విన్స్‌కు జన్మనిచ్చిన తర్వాత ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉపాసన తన పోస్ట్‌లో రాస్తూ.." ఇది చూసిన ప్రతిసారీ నా హృదయం సంతోషంతో నిండిపోతోంది. మన చుట్టూ ఉన్న ప్రేమ, బలం, సానుకూలతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నా. మా కుటుంబం నిజంగా అదృష్టవంతులం.  తేజస్వి గారు.. అపోలో హాస్పిటల్స్ బృందం నిబద్ధతతో మాకోసం పనిచేశారు. రామ్ చరణ్ అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ  మనసు నుంచి వచ్చిందని నాకు తెలుసు. మీరు మా పిల్లలను ఎల్లప్పుడూ రక్షిస్తారని.. వారి భద్రతను గౌరవిస్తారని నేను నమ్ముతున్నా. ప్రపంచవ్యాప్తంగా మా కోసం ప్రార్థించిన  ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా హృదయంలో పదిలంగా ఉంటాయి' అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement