టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అసమ్మతి.. మళ్లీ మొదలైన వివాదం | Tollywood Cine Workers Union Leaders Letters To Federation Threaten Strike Over Unresolved Issues | Sakshi
Sakshi News home page

Tollywood: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అసమ్మతి.. మళ్లీ మొదలైన వివాదం

Feb 9 2026 8:52 PM | Updated on Feb 10 2026 10:54 AM

Tollywood Cine Workers Union Leaders Letters To Federation

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కథ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో తలెత్తిన సినీ కార్మికుల వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా  టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్  సభ్యులు ఫిల్మ్ ఫెడరేషన్‌ అధ్యక్షుడికి లేఖలు రాశారు. దీంతో ముగిసిపోయిందనుకున్న సమస్య మళ్లీ అసమ్మతి సెగలకు కారణమైంది. 

తమ సమస్యలు ఈ నెలాఖరు లోపు పరిష్కరించాలని కోరుతూ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా వీరి బాటలోనే మరో 11 యూనియన్లు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని యూనియన్ల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వం, ఛాంబర్ పెద్దలతో చర్చించి మాకు న్యాయం చేయాలని యూనియన్ నాయకులు అంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే మార్చి ఒకటి నుంచి సమ్మెకు దిగుతామని టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు.

cine workers
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement