దృశ్యం నటి.. ఒకే ఒక్క సీరియల్‌తో సినిమా ఛాన్స్..! | Interesting Facts about Mohanlal Drishyam 3 actress Asha Sarath | Sakshi
Sakshi News home page

Asha Sarath: దృశ్యం నటి.. ఆ ఒక్క పాత్రకే సినిమా ఛాన్స్..!

Feb 9 2026 7:27 PM | Updated on Feb 9 2026 7:39 PM

Interesting Facts about Mohanlal Drishyam 3 actress Asha Sarath

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో దృశ్యం-3 ఒకటి. గతంలో విడుదలైన రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్  మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ ఫ్రాంచైజీలో వస్తోన్న దృశ్యం 3  ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది.  జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి ఆడియన్స్‌ను అలరించనుంది.

అయితే ఈ సినిమాలో ఐజీ గీతా ప్రభాకర్ పాత్రలో మెప్పించిన నటి ఆశా శరత్‌. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోతుందని తెలిపింది. మిమ్మల్ని సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందని పేర్కొంది. ఈ క్లైమాక్స్ చూస్తే మీరంతా కచ్చితంగా షాకవుతారని చెప్పుకొచ్చింది.

అసలు ఎవరీ ఆశా శరత్?

దృశ్యం ఫ్రాంచైజీలో ఛాన్స్ కొట్టేసిన ఆశా శరత్‌ ఎవరనే విషయంపై నెట్టింట చర్చ మొదలైంది. అసలు ఆమె సినిమాల్లో ఎలా వచ్చిందనే దానిపై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తాజాగా ఆశా శరత్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. మలయాళ బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఓకే ఒక్క సీరియల్‌తో మూవీస్‌లో అడుగుపెట్టింది.

స్వతహాగా డ్యాన్సర్ అయినా ఆశా శరత్.. మలయాళంలో 'కుంకుమ పువ్వు' అనే  సీరియల్‌తో నటనారంగ ప్రవేశం చేసింది. ఇందులో లీడ్ రోల్ అయినా ప్రొఫెసర్ జయంతి పాత్ర పోషించింది.  ఈ క్యారెక్టర్‌తోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ‍అలా తనకు కుంకుమ పువ్వు సీరియల్‌లో నటిస్తున్నప్పుడే దృశ్యం సినిమాలో అవకాశం వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత ఆమె ఫ్రైడే, కర్మయోధ, అర్ధనారి, జకరియాయుడే గర్భిణికల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ దృశ్యం సినిమానే ఆమె  కెరీర్‌ను మలుపు తిప్పింది. మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ వెర్షన్లలో కూడా అదే పాత్రను పోషించింది.

ఆశా శరత్ మాట్లాడుతూ.. "నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఆందోళన ఉండేది. సీరియల్‌లో జయంతి పాత్ర అనేది ఎమోషనల్‌తో కూడుకున్నది. ఒకవేళ ప్రేక్షకులు గీతా ఐపీఎస్ కూడా పోలీసు యూనిఫాంలో ఉన్న జయంతి లాగే ఉందని భావిస్తే ఎలా? అది సినిమాపై, నాపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన చెందా. కానీ వారి స్పందన నన్ను ఆశ్చర్యపరిచింది.  మలయాళీలు చాలా తెలివైనవారు. పాత్రల మధ్య తేడాను ఎలా గుర్తించాలో వారికి బాగా తెలుసు' అని గతంలోనే చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, మురళి గోపి, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement