breaking news
Drishyam 3 Movie
-
దృశ్యంకి ముహూర్తం ఫిక్స్
‘దృశ్యం’ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ఇప్పటికే విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో రానున్న మూడో చిత్రం ‘దృశ్యం 3’. తెలుగులో వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’ (2014), వెంకటేశ్ హీరోగా జీతూ జోసెఫ్ డైరెక్షన్లో రూపొందిన ‘దృశ్యం 2’ (2021) సినిమాలు హిట్‌గా నిలిచాయి. ఈ ఫ్రాంచైజీలో మలయాళం, హిందీ భాషల్లో ‘దృశ్యం 3’ చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. అయితే తెలుగు లో ‘దృశ్యం 3’ పట్టాలెక్కుతుందా? లేదా అని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాత, హీరో వెంకటేశ్ సోదరుడు సురేష్‌బాబు ఇచ్చిన అప్డేట్తో ఈ వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లయింది. శోభిత ధూళిపాళ్ల లీడ్ రోల్లో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘చీకటిలో..’. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై డి. సురేష్‌బాబు నిర్మించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సురేష్‌బాబు ‘దృశ్యం 3’ షూట్‌కి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు స్పష్టత ఇచ్చారు. ‘‘దృశ్యం 3’ సినిమాలోనూ వెంకటేశ్ హీరోగా నటిస్తారు. ఈ చిత్రం అక్టోబరులో సెట్స్‌పైకి వెళుతుంది’’ అని చెప్పారు. అయితే దర్శకుడి పేరు మాత్రం చెప్పలేదు ఆయన. ఇదిలా ఉంటే... ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ అనే సినిమాలో నటిస్తున్నారు వెంకటేశ్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ షూట్ పూర్తయ్యాక ‘దృశ్యం 3’ చిత్రీకరణలో పాల్గొంటారు వెంకటేశ్. -
సూపర్ హిట్ సిరీస్ మూవీ.. దృశ్యం-3 రిలీజ్ ఎప్పుడంటే?
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన దృశ్యం సిరీస్ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రెండు పార్ట్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాలను తెలుగు, హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో వెంకటేశ్, హిందీ అజయ్ దేవగణ్ ఈ చిత్రాల్లో నటించారు.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తోన్న దృశ్యం-3 రిలీజ్ తేదీని ప్రకటించారు. ఓ వీడియోను షేర్ చేసిన మోహన్‌లాల్.. ఏప్రిల్ 02న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ఈ సమ్మర్లో సినీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. కాగా.. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మించారు. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కించారు. ఈ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామని గతంలో దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పారు.Years passed. The past didn’t.#Drishyam3 | Worldwide Release | April 2, 2026@jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk #MeenaSagar@aashirvadcine@PanoramaMovies @PenMovies @ram_rampagepix @Rajeshmenon1969 @Abh1navMehrotra @drishyam3movie pic.twitter.com/uqEaPvqMyv— Mohanlal (@Mohanlal) January 14, 2026 -
బట్టతలపై జుట్టుండాలట.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలా!
దృశ్యం ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో భాగం "దృశ్యం 3". మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవగా త్వరలోనే హిందీలో షూటింగ్ మొదలుకానుంది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.సడన్‌గా విగ్ కావాలట!పారితోషికం పెంపుతోపాటు, విగ్ కావాలని కోరాడని.. ఈ విషయంలో నిర్మాతతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన సినిమా నుంచి వైదొలగాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఇవే నిజమంటున్నాడు నిర్మాత కుమార్ మంగట్ పాఠక్. ఆయన మాట్లాడుతూ.. దృశ్యం 3 కోసం అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడు. ఆయన అడిగినంత డబ్బు ఇస్తామన్నాం. కానీ ఆయన విగ్ కావాలని డిమాండ్ చేశాడు. పక్కనున్న చెంచాల వల్లే..దృశ్యం 2లో అక్షయ్ విగ్ లేకుండా బట్టతలతోనే కనిపించాడు. అలాంటిదిప్పుడు విగ్ పెడితే బాగోదని దర్శకుడు అభిషేక్ పాఠక్ నచ్చజెప్పాడు. దాంతో ఆయన సరేనన్నాడు. అయితే ఆయన పక్కనున్న చెంచాలు విగ్ పెట్టుకుంటే స్మార్ట్‌గా కనిపిస్తావని లేనిపోనివి ఎక్కించారు. దాంతో ఆయన మళ్లీ విగ్ కావాలని అడిగాడు. దర్శకుడు ఆయన్ను సముదాయించాలని చూశాడు. అప్పుడేమో ఎగిరి గంతేసి..కానీ ఈసారి అతడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడు. దృశ్యం 3 కథ చెప్పినప్పుడు.. ఇది రూ.500 కోట్ల సినిమా.. జీవితంలో ఇలాంటి కథ వినలేదంటూ టీమ్‌ను హత్తుకున్నాడు. రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యాక అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో తనకు నోటీసులు పంపించాం.గుర్తింపు లేని సమయంలో ఛాన్స్అక్షయ్కు పేరు, గుర్తింపు లేని సమయంలో తనతో సెక్షన్ 375 మూవీ చేశాను. ఆయన గురించి చాలామంది ఎన్నో చెప్పారు. సెట్లో కూడా ఓవర్‌గా ప్రవర్తించేవాడు. సెక్షన్ 375 వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అలా అతడిని దృశ్యం 2కి తీసుకున్నాను. ఈ మూవీ తర్వాతే అతడికి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడేమో గర్వం తలకెక్కింది.అక్షయ్ కంటే మంచి నటుడుదృశ్యం.. అజయ్ దేవ్‌గణ్ మూవీ, ఛావా.. విక్కీ కౌశల్ మూవీ, అలాగే ధుంధర్ రణ్వీర్ సింగ్ సినిమా! ఒకవేళ అక్షయ్ ఖన్నా సోలోగా సినిమా చేస్తే దానికి రూ.50 కోట్లు కూడా రావు. తనవల్లే ధురంధర్ బాగా ఆడుతోందని మాతో అన్నాడు. ధురంధర్ విజయానికి అనేక కారణాలున్నాయి. దృశ్యం 3లో అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్‌ను తీసుకున్నాం. అక్షయ్ కంటే ఇతడు మంచి నటుడు అని చెప్పుకొచ్చాడు.చదవండి: నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ -
దృశ్యం 3 నుంచి 'ధురంధర్' నటుడు అవుట్?
థ్రిల్లర్ మూవీ 'దృశ్యం' సూపర్ డూపర్ హిట్టు. దర్శకుడు జీతూ జోసెఫ్, హీరో మోహన్‌లాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయి అక్కడా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో 'దృశ్యం' ఫ్రాంచైజీలో రెండవ భాగాన్ని తీసుకొచ్చారు. కాకపోతే 2021లో కరోనా వల్ల మలయాళ వర్షన్‌ను ఓటీటీలో రిలీజ్ చేశారు. సూపర్ హిట్ దృశ్యంఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ రావడటంతో తెలుగు, హిందీలో రీమేక్ చేశారు. వెంకటేశ్ 'దృశ్యం 2' కూడా అదే ఏడాది ఓటీటీలో విడుదలైంది. అయితే అజయ్ దేవ్‌గణ్ హిందీ 'దృశ్యం 2' మాత్రం 2022లో బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు' దృశ్యం' మూడో పార్ట్ రాబోతోంది. మూడో పార్ట్మోహన్లాల్- జీతూ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హిందీలో అజయ్ దేవ్‌గణ్ 'దృశ్యం 3' షూటింగ్ ఇటీవలే మొదలైంది. టబు, శ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పాఠక్ డైరెక్టర్. ఈ మూవీ 2026 అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో డిమాండ్ఈయన 'దృశ్యం 2'లో పోలీసాఫీసర్‌గా కనిపించారు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్ అయిన అక్షయ్.. మూడో పార్ట్ (Drishyam 3 Movie)లో నటించేందుకు కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట! అలాగే తన పాత్ర తెరపై కనిపించే తీరులో కొన్నిమార్పులు చేయమని సూచించాడట! నిజమెంత?ఈ విషయంలో నటుడికి, నిర్మాతలకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు భోగట్టా.. దీంతో ఆయనే స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైనప్పటికీ అక్షయ్ ఖన్నా డిమాండ్లకు తలొగ్గి మళ్లీ అతడిని సినిమాలో తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.చదవండి: వితికా షెరుకు ప్రమోషన్ -
అక్టోబరులో దృశ్యం 3
హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూజోసెఫ్ కాంబినేషన్ లో రూపొందిన మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే వీరి కాంబినేషన్ లోనే ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని సినిమాలు ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు.కాగా, హిందీ వెర్షన్ ‘దృశ్యం 3’ షూటింగ్ మొదలైంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ ‘దృశ్యం 3’ చిత్రానికి అభిషేక్పాఠక్ డైరెక్టర్. టబు, శ్రియా శరణ్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. అలోక్ జైన్ , అజిత్ అంథారే నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబరు 2న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్ లో వెంకటేశ్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కావాల్సి ఉంది. -
దృశ్యం-3 విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్
దృశ్యం-3 సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు పలు భాషలలో సూపర్ హిట్ అయ్యాయి. అయితే, తాజాగా దృశ్యం-3 హిందీ వర్షన్ అప్డేట్ ఇచ్చారు. అజయ్ దేవగణ్ హీరోగా డైరెక్టర్ అభిషేక్ పాఠక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2026 అక్టోబర్ 2న విడుదల కానుందని చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇకపోతే ఈ సిరీస్‌లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. మూడో భాగంలోనూ మోహన్‌లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయింది. తెలుగులో వెంకటేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. -
పనోరమా, పెన్ స్టూడియోస్ ఖాతాలో దృశ్యం–3
నటుడు మోహన్‌లాల్ మలయాళంలో కథానాయకుడిగా నటించిన దశ్యం చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటూ తెలుగు, తమిళం తదితర భాషల్లోనూ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దృశ్యం –2 చిత్రం రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా దృశ్యం– 3 నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇంతకుముందు రూపొందిన దృశ్యం 1,2 చిత్రాలు విశేష ప్రేక్షకుల ఆదరణ పొందడంతో తాజాగా రూపొందిన దృశ్యం –3 చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ నిర్మించింది. కాగా పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన దృశ్యం – 3 చిత్రం ప్రపంచవ్యాప్త విడుదల హక్కులను, డిజిటల్ హక్కులను పనోరమ స్టూడియోస్ ,పెన్ స్టూడియోస్ సంస్థలు కలిసి పొందాయి. ఇంతకు ముందు దృశ్యం – 2 చిత్రాన్ని మనోరమ స్టూడియోస్ సంస్థ హిందీలో నిర్మించి మంచి విజయాన్ని అందుకుందని ఆ సంస్థ అధినేత కుమార్ మంగత్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా దశ్యం – 3 చిత్రాన్ని పనోరమ స్టూడియోస్‌తో కలిసి విడుదల హక్కులను పొందడం, ఈ చిత్రాన్ని గ్లోబల్ ప్లాట్ఫారానికి తీసుకువెళ్లడం సంతోషంగా ఉందని పెన్ స్టూడియోస్ సంస్థ అధినేత డాక్టర్ జయంతి లాల్ గడ పేర్కొన్నారు. న్యూ సీక్రెట్స్‌తో కూడిన దృశ్యం– 3 చిత్రంతో మళ్లీ పాత మిత్రులందరిని కలవబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉందని నటుడు మోహన్‌లాల్ పేర్కొన్నారు. కాగా దృశ్యం సీక్వెల్‌కు అంతమే లేదని దర్శకుడు జీతూ జోసఫ్ పేర్కొన్నారు. -
దృశ్యం 3 షూట్ కంప్లీట్
హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లోని సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ‘దృశ్యం’ సిరీస్ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ ఏడాది ‘దృశ్యం 3’ సినిమాను కూడా ప్రకటించారు మోహన్‌లాల్. ఈ ఏడాది సెప్టెంబరు మూడో వారం ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. డిసెంబరు 2న ఈ’ సినిమా చిత్రీకరణ ముగిసిందని యూనిట్ సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా పేర్కొంది. ఇలా అతి తక్కువ సమయంలోనే ‘దృశ్యం 3’ సినిమా చిత్రీరకణ పూర్తి కావడం విశేషం.ఇక ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మించిన ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కనుంది. ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్లో వెంకటేశ్, హిందీ వెర్షన్లో అజయ్ దేవగన్ నటిస్తారు. కాగా, ‘దృశ్యం 3’ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామన్నట్లుగా ఆ మధ్య దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పారు.మరి... జీతూ జోసెఫ్ అనుకున్నట్లుగానే ‘దృశ్యం 3’ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... మోహన్‌లాల్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘వృషభ’ ఈ డిసెంబరు 25న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మోహన్‌లాల్ హీరోగా నటించి, విడుదలైన ‘ఎల్2: ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇంకా ‘దృశ్యం 3’ సినిమా తర్వాత రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట మోహన్‌లాల్. -
'దృశ్యం 3' సెట్స్‌లో మోహన్ లాల్‌కి సన్మానం (ఫొటోలు)
-
మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
జార్జ్ కుట్టి ప్రపంచంలోకి...
ప్రేక్షకులను మరోసారి జార్జ్ కుట్టి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు మోహన్‌లాల్ సిద్ధమయ్యారు. దర్శకుడు జీతూ జోసెఫ్, హీరో మోహన్‌లాల్ కాంబినేషన్లోని ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే వచ్చిన ‘దృశ్యం 1, దృశ్యం 2’ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లోనే ‘దృశ్యం 3’ రానుంది.ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం కేరళలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాల్లో నటించిన మీనా ‘దృశ్యం 3’లోనూ నటిస్తున్నారు. జార్జ్ కుట్టి పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు. ‘‘జార్జ్ కుట్టి ప్రపంచం మళ్లీ జీవం పోసుకుంది. ‘దృశ్యం 3’ పూజా కార్యక్రమాలతో మొదలైంది’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా మోహన్ లాల్ పోస్ట్ చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇక మోహన్ లాల్ నటించిన పీరియాడికల్ వార్ డ్రామా ‘వృషభ’ చిత్రం ఈ దీపావళికి రిలీజ్ కానుంది. -
మూడుభాషల్లో ఒకేసారి దృశ్యం 3
‘దృశ్యం’ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సిరీస్‌లో రానున్న మూడో చిత్రం ‘దృశ్యం 3’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’, వెంకటేశ్–జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రూపొందిన ‘దృశ్యం 2’ హిట్‌గా నిలిచాయి.ఇక హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా డైరెక్టర్ నిషికాంత్ కామత్ తెరకెక్కించిన ‘దృశ్యం’, అజయ్ దేవగణ్– డైరెక్టర్ అభిషేక్ పాఠక్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం 2’ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇకపోతే ఈ సిరీస్‌లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. మూడో భాగంలోనూ మోహన్‌లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది.ఇదిలా ఉంటే... జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకుండా హిందీలో ‘దృశ్యం 3’ ఉంటుందని అజయ్ దేవ్‌గణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా జీతూ జోసెఫ్ మాట్లాడుతూ–‘‘మలయాళంలో నేను రాసిన కథతోనే తెలుగు, హిందీ భాషల్లోనూ ‘దృశ్యం 3’ సినిమా వస్తుంది. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక హిందీ మూవీ టీమ్‌కు ఇస్తాను. అక్కడి సంస్కృతి, నేటివిటీకి తగ్గట్టు వాళ్లు కథలో మార్పులు చేసుకుంటారు.మూడు భాషల్లో ఒకేసారి ‘దృశ్యం 3’ని చిత్రీకరించడం సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచన ఉంది’’ అని స్పష్టం చేశారాయన. ‘దృశ్యం 3’ తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగణ్ హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు. అయితే దర్శకులు ఎవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
'గతం నిశ్శబ్దంగా ఉండదు'.. మోహన్ లాల్ దశ్యం-3 ఎప్పుడంటే?
దృశ్యం సినిమా సిరీస్‌కు ఆడియన్స్‌లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు పార్టులు విడుదలై అభిమానులను అలరించాయి. మలయాళంలో వచ్చిన ఈ సినిమాను అటు తెలుగులో.. ఇటు బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయగా సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇప్పటికే ఈ సూపర్ హిట్ మూవీ సిరీస్‌లో దృశ్యం-3 కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే తాజాగా దృశ్యం-3 రిలీజ్ ఎప్పుడనేది కూడా మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల కానుందనిప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దృశ్యం మూవీపై మోహన్ లాల్ మాట్లాడుతూ.. 'దృశ్యం సినిమా మలయాళ పరిశ్రమకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. కొవిడ్ మహమ్మారి సమయంలో మేము ఆ చిత్రాన్ని నిర్మించాం. ఆ చిత్రాన్ని భారతదేశమంతా వీక్షించింది. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మలయాళ పరిశ్రమ గురించి తెలుసు. దృశ్యం తర్వాత మరిన్ని మలయాళ చిత్రాలను చూడటం ప్రారంభించారు. ఇది మా పరిశ్రమకు, అంతర్జాతీయంగా కూడా ఒక వరంలా మారింది." అని సంతోషం వ్యక్తం చేశారు.'దృశ్యం సూపర్ హిట్ తర్వాత హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, సింహళీ, చైనీస్ భాషలలో కూడా రీమేక్ చేశారు. మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో 'దృశ్యం 3' హిందీ వర్షన్ సైతం అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మలయాళ సినిమాను రీమేక్ చేస్తారా? లేదంటే సొంతగా కథను తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. తొలి రెండు భాగాలు మలయాళం నుంచి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. October 2025 — the camera turns back to Georgekutty.The past never stays silent.#Drishyam3 pic.twitter.com/8ugmxmb2wO— Mohanlal (@Mohanlal) June 21, 2025 -
గతం నిశ్శబ్దంగా ఉండదు!
మలయాళంలో హీరో మోహన్‌లాల్(Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్‌ల కాంబినేషన్లోని ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బ్లాక్‌బస్టర్. ఈ మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని సినిమాలు భారతదేశ ఇతర భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. రీమేక్ అయిన ప్రతి భాషలోనూ ఈ చిత్రం హిట్ కావడం విశేషం. ‘దృశ్యం’ సినిమాకు ఇంతటి క్రేజ్ ఉంది. కాగా కొన్ని రోజులుగా ‘దృశ్యం 3’ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందనే టాక్ మాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉంది.ఫైనల్‌గా గురువారం ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు మోహన్‌లాల్. ‘దృశ్యం 3’(Drishyam 3)సినిమా కన్ఫార్మ్ అని, ‘ఎక్స్’లో ఓ ఫొటోను షేర్ చేశారు. ‘ఎక్స్’లో మోహన్‌లాల్ పేర్కొన్న పోస్ట్‌లో ‘ది పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్’ (గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు) అనే క్యాప్షన్ కూడా ఉంది. ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలను నిర్మించిన ఆంటోనీ పెరుంబవూర్ ‘దృశ్యం 3’ సినిమానూ నిర్మించనున్నారు.త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. మరోవైపు అనూప్ మీనన్‌తో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని ఇటీవల ప్రకటించారు మోహన్‌లాల్. ఆయన సోలో హీరోగా అనూప్ మీనన్ మూవీని పూర్తి చేసిన తర్వాత ‘దృశ్యం 3’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక మమ్ముట్టీ, మోహన్‌లాల్‌ల కాంబినేషన్లో ఓ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే మోహన్‌లాల్ సోలో హీరోగా నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుంది. -
దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ..
-
కంక్లూజన్ తో వచ్చేస్తున్న దృశ్యం 3
-
బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అవుతున్న వెంకటేష్
-
బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అవుతున్న వెంకటేష్
-
'దృశ్యం 3' ఆ రెండు భాషల్లో ఒకేసారి.. నిజమెంత?
ప్రస్తుత జనరేషన్ కి థ్రిల్లర్ సినిమాలంటే పిచ్చి. థియేటర్, ఓటీటీ ఇలా ఎందులో దొరికితే అందులో తెగ చూసేస్తున్నారు. ఈ జానర్ లో 'దృశ్యం' ఫ్రాంచైజీ సరికొత్త బెంచ్ మార్క్స్ సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని ఓ రేంజులో ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు మూడో పార్ట్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం'.. 2013లో థియేటర్లలోకి వచ్చింది. థ్రిల్లర్ జానర్ లో వండర్స్ క్రియేట్ చేసింది. దీన్నే తెలుగు, హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. తీసిన ప్రతిభాషలోనూ సూపర్ హిట్ అవడంతోపాటు అదిరిపోయే రేంజ్లో వసూళ్లు సాధించింది. దీంతో మూడో పార్ట్ కోసం అందరూ వెయిటింగ్. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్ పెళ్లి.. పోస్ట్ వైరల్) తొలి రెండు పార్ట్స్ తీసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్.. మూడో భాగం కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మలయాళం, హిందీలో ఒకేసారి షూట్ చేయాలనుకున్నారని.. దీనివల్ల సినిమాలోని స్పాయిలర్స్ కి అస్సలు ఛాన్స్ ఉండదని ఆయన భావిస్తున్నట్లు ఓ వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ వరకు చేరింది. దీంతో ఆయన దీనిపై స్పందించారు. 'బయట వినిపిస్తున్నవి ఏవి నిజం కాదు. దృశ్యం 3 పనులు ఇంకా మొదలుపెట్టలేదు. మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేస్తామనేది కూడా రూమర్ మాత్రమే' అని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: 'బిచ్చగాడు 2' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్) -
క్లైమాక్స్ ట్విస్ట్...!
-
ఇది కదా అసలు సిసలైన పాన్ ఇండియా కథ!
ఒక ‘దృశ్యం’... మలయాళంలో బంపర్ హిట్. అదే ‘దృశ్యం’... తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలోనూ సూపర్ హిట్. అందుకే ఈ ‘దృశ్యం’ దేశం దాటింది. అటు చైనా.. ఇండోనేషియాలోనూ ‘దృశ్యం’ బాక్సాఫీస్ రికార్డులు సాధించింది. ఇలా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఏ భాషలో రీమేక్ అయితే ఆ భాషలో హిట్. ఇప్పుడు ఇంగ్లీష్ ‘దృశ్యం’ రానుంది. ఇంకా పలు విదేశీ భాషల్లో రీమేక్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే సినిమాలను ‘పాన్ ఇండియా’ అంటున్నాం. ‘పాన్ ఇండియా మూవీ’ అంటే కథ కూడా ‘పాన్ ఇండియా’ది అయ్యుండాలి.‘దృశ్యం’ అలాంటి కథే. ఇది కదా... పాన్ ఇండియా కథ! ఇక ఈ ‘దృశ్యం’ గురించి తెలుసుకుందాం. తొమ్మిదేళ్ల క్రితం హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. 2013 డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిందీ చిత్రం. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఎంతగా నచ్చిందంటే.. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో యాభై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ‘దృశ్యం’ చరిత్ర సృష్టించింది. మొత్తంగా 75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 44 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ‘దృశ్యం’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో 2020 సెప్టెంబర్‌లో ‘దృశ్యం 2’ షూటింగ్‌కు శ్రీకారం చూట్టారు మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ అండ్ ఆంటోనీ పెరుంబవూర్. తొలి భాగంలానే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో 46 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేసి 2021 ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ‘దృశ్యం 2’ కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ఓ వెలితి. అదేంటంటే.. ‘దృశ్యం 2’ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దీనికి కారణం కరోనా. ఒకవేళ థియేటర్స్‌లో విడుదలై ఉంటే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదై ఉండేవేమో! 2016లో విడుదలై దాదాపు రూ. 150 కోట్ల వసూళ్లను సాధించిన ‘పులిమురుగన్’(ఇందులో మోహన్‌లాల్ హీరో) రికార్డును ‘దృశ్యం 2’ బ్రేక్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయయపడ్డాయి. తొలి ఇండియన్ మూవీ! ‘దృశ్యం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై వీక్షకుల, విమర్శకుల ప్రసంశలను పొందింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మలయాళ ‘దృశ్యం’ సినిమాను 2014లో తెలుగులో ‘దృశ్యం’గా (ఇందులో వెంకటేశ్ హీరోగా నటించారు), కన్నడంలో ‘దృశ్య’ (ఇందులో రవిచంద్రన్)గా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2015లో తమిళంలో ‘పాపనాశం’గా (కమల్‌హాసన్ హీరో), హిందీలో ‘దృశ్యం’ (అజయ్ దేవగన్)గా రీమేక్ చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత శ్రీలంక భాషలో ‘ధర్మయుద్దాయ’ (2017)గా, చైనాలో ‘షీప్ వితవుట్ షెపర్డ్’(2019)గా ఆ తర్వాత ఇండోనేషియాలో ‘దృశ్యం’గా రీమేక్ అయ్యింది. ఇలా చైనా, ఇండోనేషియా భాషల్లో రీమేక్ అయిన తొలి ఇండియన్ మూవీ కూడా ‘దృశ్యం’ కావడం విశేషం. రీమేక్ కావడమే కాదు.. అక్కడ బాక్సాఫీస్ పరంగా హిట్ సాధించింది. కాగా, ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా 2021లో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’కి కూడా డిజిటల్ వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘దృశ్యం 2’ను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేశ్‌నే ‘దృశ్యం 2’లోనూ నటించారు. కోవిడ్ వల్ల ఈ చిత్రం 2021 నవంబరు 25న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ గత ఏడాది నవంబరు 18న థియేటర్స్‌లో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2022లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ హిందీ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. హిందీ ‘దృశ్యం’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లోనూ నటించారు. అలాగే హిందీ చిత్రం ‘దేవదాస్’ (1955) తర్వాత ఇతర భాషల్లో ఎక్కువగా రీమేక్ అవుతున్న చిత్రం ‘దృశ్యం’ అని టాక్. మాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి... ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు సంబంధించిన ఇంగ్లిష్, నాన్ ఇండియన్ లాంగ్వేజెస్ రీమేక్ హక్కులను పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకుంది (ఫిలిప్పినో, ఇండోనేషియా, సింహళ భాషల హక్కులు మాత్రం కాదు.. ఎందుకంటే ఈ భాషల్లో ఆల్రెడీ ‘దృశ్యం’ రీమేక్ అయ్యింది). ‘‘దృశ్యం’, ‘దృశ్యం 2’ల ఫారిన్ లాంగ్వేజెస్ హక్కులను దక్కించుకున్నాం. జపాన్, కొరియా, హాలీవుడ్లో ‘దృశ్యం’ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. ‘దృశ్యం 2’కు చెందిన చైనీస్ రీమేక్ హక్కులు కూడా మా వద్దే ఉన్నాయి’’ అని పనోరమ స్టూడియోస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కథ ఏంటంటే... సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన పెద్ద కుమార్తెను ఊహించని ఆపాయం నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? ఈ ప్రయత్నంలో ఓ పోలీసాఫీసర్ కుమారుడి హాత్య కేసును చేధించాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యూహాలకు ఎటుంవంటి ప్రతివ్యూహాలు రచించి, ఆ తండ్రి సక్సెస్ అయ్యాడు అన్నదే ఈ చిత్రకథ. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్, ఆంటోనీల కాంబినేషన్లో ‘దృశ్యం 3’ కూడా రానుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో ‘దృశ్యం 3’ ఉంటుందన్నారు ఆంటోనీ. చదవండి: నాకు బుద్ధి తక్కువై అలా చేశాను.. చీటింగ్‌పై స్పందించిన సింగర్ -
ఓ కంక్లూజన్‌తో మోహన్ లాల్ 'దృశ్యం 3'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్
Mohanlal Drishyam 3 First Look Poster Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2. మొదటగా వచ్చిన 'దృశ్యం' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మాసీవ్ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు, తమిళంలో కూడా రీమేక్ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా నటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'దృశ్యం 2' కూడా ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ తండ్రి చేస్తున్న యుద్ధమే ఈ సిరీస్‌ల కథగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ సిరీస్‌లో మూడో చిత్రం రానుంది. ఈ రెండు పార్ట్‌లకు కొనసాగింపుగా 'దృశ్యం 3' రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'దృశ్యం 3: ది కంక్లూజన్' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మోహన్ లాల్ సంకెళ్లతో ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించడం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్‌పై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కాగా మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన జీతూ జేసేఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మరీ ఈ మూడో చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సేందే. అలాగే ఈ మూడో భాగంతో ఓ కంక్లూజన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. #Drishyam3 The Conclusion offical announcement soon#Mohanlal @Mohanlal pic.twitter.com/X8dVERlaTR — Shivani Singh (@lastshivani) August 13, 2022 #Drishyam3 George Kutty & Family are coming back! pic.twitter.com/VUoT6m0gLF — Christopher Kanagaraj (@Chrissuccess) August 13, 2022


