హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూజోసెఫ్ కాంబినేషన్ లో రూపొందిన మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే వీరి కాంబినేషన్ లోనే ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని సినిమాలు ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు.
కాగా, హిందీ వెర్షన్ ‘దృశ్యం 3’ షూటింగ్ మొదలైంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ ‘దృశ్యం 3’ చిత్రానికి అభిషేక్‌పాఠక్ డైరెక్టర్. టబు, శ్రియా శరణ్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. అలోక్ జైన్ , అజిత్ అంథారే నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబరు 2న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్ లో వెంకటేశ్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కావాల్సి ఉంది.


