నటుడు మోహన్‌లాల్ మలయాళంలో కథానాయకుడిగా నటించిన దశ్యం చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటూ తెలుగు, తమిళం తదితర భాషల్లోనూ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దృశ్యం –2 చిత్రం రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా దృశ్యం– 3 నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇంతకుముందు రూపొందిన దృశ్యం 1,2 చిత్రాలు విశేష ప్రేక్షకుల ఆదరణ పొందడంతో తాజాగా రూపొందిన దృశ్యం –3 చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే.
జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ నిర్మించింది. కాగా పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన దృశ్యం – 3 చిత్రం ప్రపంచవ్యాప్త విడుదల హక్కులను, డిజిటల్ హక్కులను పనోరమ స్టూడియోస్ ,పెన్ స్టూడియోస్ సంస్థలు కలిసి పొందాయి. ఇంతకు ముందు దృశ్యం – 2 చిత్రాన్ని మనోరమ స్టూడియోస్ సంస్థ హిందీలో నిర్మించి మంచి విజయాన్ని అందుకుందని ఆ సంస్థ అధినేత కుమార్ మంగత్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
కాగా దశ్యం – 3 చిత్రాన్ని పనోరమ స్టూడియోస్‌తో కలిసి విడుదల హక్కులను పొందడం, ఈ చిత్రాన్ని గ్లోబల్ ప్లాట్‌ఫారానికి తీసుకువెళ్లడం సంతోషంగా ఉందని పెన్ స్టూడియోస్ సంస్థ అధినేత డాక్టర్ జయంతి లాల్ గడ పేర్కొన్నారు. న్యూ సీక్రెట్స్‌తో కూడిన దృశ్యం– 3 చిత్రంతో మళ్లీ పాత మిత్రులందరిని కలవబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉందని నటుడు మోహన్‌లాల్ పేర్కొన్నారు. కాగా దృశ్యం సీక్వెల్‌కు అంతమే లేదని దర్శకుడు జీతూ జోసఫ్ పేర్కొన్నారు.


