వైద్య రంగంలో చాలా అవకతవకలు జరుగుతుంటాయి. వాటిపై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌పై ఓ వెబ్ సిరీస్ తీశారు. అదే 'ఫార్మా'. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ.. లీడ్ రోల్ చేశాడు. ఇతడు 'ప్రేమమ్' హీరోగా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమే. ఈ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)
నివిన్ పౌలీ, శ్రుతి రామచంద్రన్, రజిత్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'ఫార్మా' వెబ్ సిరీస్.. వచ్చే శుక్రవారం (డిసెంబరు 19) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది. పీఏ అరుణ్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు.
ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ ఫార్మా కంపెనీలో కేపీ వినోద్(నివిన్ పౌలీ), మెడికల్ రిప్రెజెంటివ్‌గా చేరతాడు. ప్రారంభంలో సేల్స్ చేయలేకపోతాడు. టార్గెట్స్ అస్సలు సాధించలేకపోతాడు. దీంతో విమర్శలు, అవమానాలు ఎదుర్కొంటాడు. తర్వాత ఈ ఉద్యోగంలో నిలదొక్కుకుంటాడు. 'కైడోక్సిన్' అనే మెడిసన్ సేల్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే ఈ మందు ఎంత ప్రమాదం అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దీంతో వినోద్.. అతడి సంస్థపై తిరగబడతాడు? తర్వతా ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఎలానూ తెలుగులోనూ స్ట్రీమింగ్‌కి రాబోతుంది కాబట్టి ఈ జానర్ ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: హోటల్ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి)


