నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా | Divya Dristi Movie OTT Telugu Streaming Details | Sakshi
Sakshi News home page

OTT Movie: సునీల్ నటించిన తెలుగు మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

Dec 7 2025 4:12 PM | Updated on Dec 7 2025 4:42 PM

Divya Dristi Movie OTT Telugu Streaming Details

టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. థియేటర్లలోకి వచ్చి వీటిని చూసే ప్రేక్షకులు చాలావరకు తగ్గిపోయారు. అదే టైంలో ఓటీటీలో రిలీజైన తర్వాత మాత్రం బాగానే చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలు చిన్న చిత్రాలు కొన్నిసార్లు నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. అలాంటి ఓ తెలుగు థ్రిల్లర్ సినిమానే 'దివ్య దృష్టి'. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రాబోతుంది?

'ప్రేమకావాలి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈషా చావ్లా.. ఓవర్‌నైట్ గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో టాలీవుడ్‌కి దూరమైపోయింది. చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఓ పాత్రలో నటించిందని అంటున్నారు గానీ క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే ఈమె లీడ్ రోల్ చేసిన చిత్రమే 'దివ్యదృష్టి'. సునీల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని ఈనెల 19 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

(ఇదీ చదవండి: 'గుమ్మడి నర్సయ్య'గా శివన్న.. ఎందుకు చేస్తున్నారో తెలుసా?)

'దివ్యదృష్టి' టీజర్ బట్టి చూస్తే.. ఓ అమ్మాయికి ప్రమాదవశాత్తూ కళ్లుపోతాయి. అయినా సరే బతుకుతుంది. తర్వాత తన దివ్యదృష్టిని ఉపయోగించి కొన్ని సంఘటనలని ముందుగానే చూస్తుంది. ఇంతకీ ఈమె కళ్లు పోవడానికి కారణమేంటి? ఈమె వెంటపడుతున్న వ్యక్తి ఎవరు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.

ఈ వీకెండ్ ఓటీటీ సినిమాల విషయానికొస్తే రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' నెట్‌ఫ్లిక్స్‌లో, కామెడీ మూవీ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' జీ5లో, 'స్టీఫెన్' అనే డబ్బింగ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో, సుధీర్ బాబు 'జటాధర'తో పాటు రష్మిక 'థామా' చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో, 'డీయస్ ఈరే' అనే హారర్ డబ్బింగ్ సినిమా హాట్‌స్టార్‌లోకి వచ్చాయి. అలానే 'కుట్రం పురింధవన్' అనే తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సిరీస్.. సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చింది.

(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. 'స్టీఫెన్' సినిమా ఓటీటీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement