సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు చెప్పే విషయాలు నమ్మాలా వద్దా అనే సందేహాలు రేకెత్తిస్తుంటాయి. 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి.. కొన్నాళ్ల క్రితం తనకు జరిగిన వింత అనుభవం గురించి బయటపెట్టింది. తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మ లాంటి రూపం కనిపించిందని చెప్పుకొచ్చింది. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టింది.
'కార్తీ వా వాతియర్ (అన్నగారు వస్తారు) షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చింది. తర్వాత ఆత్మ కనిపించలేదు. మరి అది నాకు సాయం చేయడానికి వచ్చిందో లేదంటే నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు. నాకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకముంది. ఎందుకంటే నేను తుళు జాతికి చెందిన అమ్మాయిని. మా పూర్వీకులని దేవతలుగా పూజిస్తాం. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతుంటారని నమ్ముతుంటాం. ఈ సంఘటన వల్ల ఆ నమ్మకం మరింత బలపడింది' అని కృతి శెట్టి చెప్పింది.
(ఇదీ చదవండి: ఈ పాపని గుర్తుపట్టారా? తండ్రి స్టార్ హీరో.. తల్లి, అక్క హీరోయిన్సే)
కార్తీ హీరోగా ఈమె నటించిన లేటెస్ట్ తమిళ మూవీ 'వా వాతియర్'. దీన్ని తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కార్తీ.. పోలీసుగా చేస్తుండగా, కృతిశెట్టి.. ఆత్మలతే మాట్లాడే జిప్సీ తరహా పాత్రలో కనిపించనుంది. అయితే కృతి చెప్పింది చూస్తుంటే ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పినట్లు అనిపిస్తుంది. మరి నిజంగా ఈమెకు ఆత్మ కనబడిందో లేదంటే కల్పించి చెబుతోందా?
కృతి కెరీర్ విషయానికొస్తే.. 'ఉప్పెన'తో సూపర్ హిట్ అందుకుంది. కానీ తర్వాత తెలుగులో చేసిన దాదాపు సినిమాలన్నీ ఫెయిల్. దీంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. కానీ కోలీవుడ్‌లో కూడా ఈమె చేసిన చిత్రాలు పలు కారణాల వల్ల ఆలస్యమైపోయాయి. ఈ మూవీ కూడా రెండు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉండి, ఇప్పుడు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)


