breaking news
Annagaru Vostaru Movie
-
నాకు సూర్య సపోర్ట్‌గా నిలిచారు.. ఇలా మరే హీరో ఉండరు: నిర్మాత
నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వా వాతియార్' తమిళ్లో నేడు విడుదల కానుంది. ఇందులో కృతిశెట్టి నాయకిగా నటించింది. సత్యరాజ్, ఆనంద్‌రాజ్ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రానికి నలన్ కుమారస్వామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా నేడు (బుధవారం) తెరపై రానుంది.ఈ సందర్భంగా చెన్నైలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు కార్తీ, నటి కృతిశెట్టి , నిర్మాత కేజీ.జ్ఞానవేల్ రాజా, సత్యరాజ్, ఆనంద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ‘‘ నేను ఎక్కడికి పారిపోలేదు. ఇక్కడే ఉన్నాను. అందరిని ఆనంద పరిచే చిత్ర పరిశ్రమలోనే ఉంటాను. నా గురించి రక రకాలుగా ప్రచారం చేశారు. అప్పుల పాలయ్యారు అని కూడా ప్రచారం చేశారు. నిజం చెప్పాలంటే సినిమా రంగంలో అప్పు లేని నిర్మాతను నేనే. నాకు పూర్తి సపోర్ట్‌గా నిలిచిన నటుడు సూర్య అన్నయ్యకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆనందంలోనే కాదు.. కష్ట సమయంలోనూ సూర్య అన్న నాకు తోడుగా ఉన్నారు. ఇలా మరే హీరో ఉండరు. ముఖం ముందు పొగిడి, వెనుక విమర్శించే వారు ఉంటారు, వారి గురించి పట్టించుకోవద్దని హితవు పలికిన ఆయన నాకు పూర్తిగా మద్దతుగా నిలిచారు. 'వా వాతియార్' చిత్రం జనరంజకంగా వచ్చింది ‘‘ అని పేర్కొన్నారు.నటుడు కార్తీ మాట్లాడుతూ ‘‘ 'వా వాతియార్'చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. జ్ఞాన వేల్ రాజా చెప్పినట్లు అన్నయ్య సూర్య ఈ చిత్రానికి ఎంతగానో సపోర్ట్ గా నిలిచారు. దర్శకుడు నలన్ కుమారస్వామి ఈ చిత్ర కథను చెప్పగానే నేను ఇందులో ౠంజీఆర్ గా నటించగలనా ?అని భయపడ్డాను. అయితే దర్శకుడు కథను అద్భుతంగా మలిచారు.ఆయన ఇచ్చిన ధైర్యంతో ఈ చిత్రంలో నటించాను. మనం సూపర్ మాన్, బ్యాట్ మాన్ సూపర్ హీరోల కల్పిత కథలతో చిత్రాలు చేస్తున్నాం. నిజ జీవితంలో ఎంజీఆర్ వంటి హిరోల కథలు చాలా ఉన్నాయి. అలాంటి కథలతో చేసిన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయి. 'వా వాతియార్' చిత్రంలో నటించడం నా అదృష్టం ‘‘అని నటుడు కార్తీ పేర్కొన్నారు. -
సడెన్‌గా సంక్రాంతి రేసులోకి వచ్చేసిన 'కార్తీ' సినిమా
కోలీవుడ్‌లో సడెన్‌గా హీరో కార్తీ సినిమా రేసులోకి వచ్చేసింది. విజయ్ మూవీ జన నాయగన్ వాయిదా పడటంతో పొంగల్ రేసులో పెద్దగా సినిమాలు లేవు. తమిళనాట ప్రస్తుతం శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ మాత్రమే ఉంది. దీంతో ఇదే సరైన సమయం అని భావించిన మేకర్స్ సడెన్‌గా 'అన్నగారు వస్తారు' విడుదల తేదీని ప్రకటించారు. వాస్తవంగా ఈ మూవీ కూడా డిసెంబరు 12న విడుదల కావాల్సి ఉంది. పలు ఆర్థిక కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఆ సమస్యలన్నీ పూర్తి కావడం వల్ల విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీంతో జనవరి 14న ‘వా వాతియార్’(అన్నగారు వస్తారు)ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే, తెలుగు వర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలదే. ఇక్కడ థియేటర్స్ దొరకడం కష్టం కాబట్టి సంక్రాంతి తర్వాత తెలుగులో విడుదల కావచ్చు. దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇందులో కృతీ శెట్టి కథానాయికగా నటించారు. కామెడీతో పాటు యాక్షన్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.ఎందుకు వాయిదా పడింది..?అన్నగారు వస్తారు మూవీ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. కొన్నేళ్ల క్రితం అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర రూ.10 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారు. కానీ, ఆ మొతాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు రూ.21.78 కోట్లకు చేరుకుంది. ఈ విషయంలో కొన్నిరోజుల క్రితమే అర్జున్.. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా.. అర్జున్ లాల్‌కి మొత్తం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. సదరు మొత్తాన్ని చెల్లించేవరకు సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజాగా ఈ సమస్య లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. -
బేబమ్మని వెంటాడుతున్న బ్యాడ్ లక్.. డేంజర్ జోన్లో కెరీర్!
తొలి సినిమాతోనే సూపర్ హిట్ దక్కడం సినీతారలకు ఓ వరం లాంటింది. ఆ ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి. వరుస అవకాశాలు వస్తాయి. స్టార్ హీరోలతో నటించే చాన్స్ వస్తుంది. అయితే ఇదంతా ఒకటి, రెండు చిత్రాలకే పనికొస్తుంది. ఆ తర్వాత కూడా హిట్ రాకపోతే..అంతే సంగతి. హీరోలలాగా హిట్ లేకపోయినా..ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండలేదు. వయసు పెరిగేకొద్ది చాన్స్‌లు తగ్గిపోతుంటాయి. పైగా టాలీవుడ్లో అందాలకు కొదవేలేదు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పుటుకొస్తున్నారు. అందుకే హీరోయిన్ల హిట్ చాలా అవసరం. ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమా ఉప్పెనతో టాలీవుడ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగింది. తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి హిట్లు పడడంతో తనకిక ఎదురులేదనుకున్నారు. కానీ ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా కిందకు పడిపోయింది ఈ బ్యూటీ. ఆమె హీరోయిన్గా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే లాంటి చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో టాలీవుడ్ ఆమెను పక్కకి పెట్టింది. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో.. మాలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. అక్కడ కూడా కలిసి రాలేదు. ఆమె నటించిన 'ఆర్మ్' అనే సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. కార్తి 'వా వాథియార్'(అన్నగారు వస్తున్నారు), ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', రవి మోహన్ 'జీని' చిత్రాల్లో నటించింది. అయితే వీటిల్లో ఒక్కటి హిట్ అయినా చాలు.. కొన్నాళ్ల పాటు ఆమెకు ఢోకా ఉండదు. కానీ హిట్ సంగతి పక్కకుపెట్టు..కనీసం విడుదలకు కూడా నోచుకోవడం లేదు. ఆమె నటించిన సినిమాన్నీ వాయిదాలు పడుతున్నాయి. ఈ నెల 12న అన్నగారు వస్తున్నారు రిలీజ్ అవ్వాల్సింది. భారీ పబ్లిసిటీ కూడా చేశారు. కానీ హఠాత్తుగా ఇప్పుడా సినిమాను వాయిదా వేసినట్టు ప్రకటించారు.ఇప్పటికే రావాల్సిన మరో తమిళ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ 18న దానిని రిలీజ్ చేస్తామని ఆ మధ్య చెప్పారు. ఆ తర్వాత ఇది కూడా వాయిదా పడినట్లు ప్రకటించారు. అలానే ఆ మధ్య 'జయం' రవి నటించిన 'జీనీ' సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. అదీ త్వరలోనే విడుదల అవుతుందని అన్నారు. కానీ డేట్ ప్రకటించలేదు.ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ టెన్షన్ పడుతుంది కృతి శెట్టి మాత్రమే. అసలే హిట్ లేక చాలా కాలం అవుతుంది. వరుస సినిమా రిలీజ్ అయితే..ప్రేక్షకులు తనను మర్చిపోకుండా ఉంటారకుంది. అందుకే ఎంతో హుషారుగా ప్రమోషన్స్ చేసింది. అన్నగారు వస్తున్నారు సినిమాతో హిట్ పడుతుందని.. అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మళ్లీ అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుంది. కానీ చివరికి వాయిదా పడడంతో బ్యాడ్‌లక్ అనుకొని సైలెంట్ అయిపోయింది. త్వరలోనే ఈ సినిమాలన్నీ రిలీజై..ఒక్కటి హిట్ అయినా కృతికి మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా ఫ్లాప్ అయితే మాత్రం.. కోలీవుడ్‌లో కూడా కృతికి అవకాశాలు రావు. ఓవరాల్‌గా ఆమె సినీ కెరీరే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది. -
అన్నగారు వస్తారుకు అఖండ 2 తరహా కష్టాలు...
-
'అన్నగారు' రావట్లేదు.. కార్తీ సినిమా మళ్లీ వాయిదా?
గతవారం సరిగ్గా థియేటర్లలో విడుదలకు కొన్ని గంటలు ఉందనగా బాలకృష్ణ 'అఖండ 2' వాయిదా పడింది. ఈ చిత్ర నిర్మాతలు.. గతంలో తీసుకున్న డబ్బుని ఈరోస్ సంస్థకు సకాలంలో చెల్లించకపోవడమే దీనికి కారణం. అయితే కోర్ట్ బయటే సమస్య పరిష్కారమైంది. డబ్బంతా నిర్మాతలు చెల్లించడంతో అఖండ సీక్వెల్‌కి మార్గం సుగమమైంది. సేమ్ దీనిలానే కార్తీ చిత్రం కూడా రిలీజ్‌కి రోజు ముందు వాయిదా పడింది.కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వా వాతియర్'. తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో రిలీజ్ ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం గతవారమే విడుదల కావాల్సింది. కానీ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా.. కొన్నేళ్ల క్రితం అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర రూ.10 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారు. కానీ ఆ మొతాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు రూ.21.78 కోట్లకు చేరుకుంది. కొన్నిరోజుల క్రితమే అర్జున్.. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు.(ఇదీ చదవండి: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త: చిన్మయి)దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా.. అర్జున్ లాల్‌కి మొత్తం చెల్లించాలని గతవారమే ఆదేశించింది. ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. సదరు మొత్తాన్ని చెల్లించేవరకు సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి జ్ఞానవేల్ రాజా.. ఈ మొత్తాన్ని రేపటిలోపు(డిసెంబరు 12) కడతారా లేదా అనేది చూడాలి? చూస్తుంటే 'అన్నగారు వస్తారు' వాయిదా పడినట్లే అనిపిస్తుంది. అన్నీ క్లియర్ అయిపోతే శనివారం (డిసెంబరు 13) విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.కార్తీ, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. తీరా ఇప్పుడు విడుదల చేసేందుకు సిద్ధమైతే పాత అప్పుల కారణంగా కోర్ట్.. రిలీజ్‌పై స్టే విధించింది. మరి ఇప్పుడు నిర్మాత జ్ఞానవేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: మీరు తిట్టకపోతే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి) -
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సినిమాలు చూడం: హీరో కార్తి
‘హీరో, సాంగ్స్, విలన్, ఫైట్స్..ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్న సినిమాలు మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సినిమాలను చూడం. ఆ పర్పెక్ట్ మాస్ కమర్షయిల్ మూవీస్ 80, 90 దశకాల్లోనే వచ్చాయి. సీరియస్ గా కథ జరుగుతున్నప్పుడు మన సినిమాల్లో ఒక పాట పెడతాం, ఆడియెన్స్ ను రిలాక్స్ చేసి మళ్లీ కథలోకి తీసుకెళ్తాం. అది మన సినిమాకే సాధ్యం. అలాంటి స్ట్రక్చర్ కథతో కొత్త మోడరన్ ప్రెజెంటేషన్ తో ‘అన్నగారు వస్తారు’ మూవీ ఉంటుంది’ అన్నారు హీరో కార్తి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్ 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనే అనుకుంటాం కానీ మన కల్చర్ లోనూ ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్ ను మార్చేశారు. అలాంటి సూపర్ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక కాల్పనిక ప్రపంచంలో జరుగుతుంటుంది.⇢ నేను ఊపిరి లాంటి మూవీస్ ఈజీగా చేయగలను కానీ అన్నగారు వస్తారు ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. అయితే రైటర్స్ కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. లేకుంటే ఎప్పుడూ ఒకే తరహా మూవీస్ చేయాల్సివస్తుంది. అవేంజర్స్ లాంటి విజువల్స్, మ్యూజిక్ తో ఈ సినిమాను నలన్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందుకే అన్నగారు వస్తారు మూవీ చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది.⇢ కథల పరంగా కొత్తగా సెలెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం నిత్యం చేస్తుంటాను. నటుడిగా నాకు ప్రత్యేకత తీసుకొచ్చేది నా స్క్రిప్ట్ సెలెక్షనే. ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇద్దరి కెరీర్స్ లో అక్కడి సినిమాలు ఇక్కడ ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్స్ జరిగాయి. ఈ క్రాసోవర్ వల్ల ఈ ఇద్దరు మహా నటుల కెరీర్ లో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అవి మా సినిమాలోనూ చూస్తారు.⇢ డైరెక్టర్ నలన్ గత సినిమాలు శాడ్ ఎండింగ్ తో ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఈ సినిమా మాత్రం హీరో సెంట్రిక్ గా ఉంటుంది. పారలల్ వరల్డ్ లో జరిగే సూపర్ హీరో సినిమా ఇది.⇢ నేను గతంలో సీరియస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చేశాను. అన్నగారు వస్తారులో పోలీస్ పాత్ర అయినా దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేశారు. నలన్ మాతో చెప్పించే డైలాగ్స్ కూడా ఒక రిథమ్ తో ఉంటాయి. మ్యూజిక్ కూడా కొత్తగా చేయిస్తాడు. సంతోష్ నారాయణన్ ను ఇంట్రడ్యూస్ చేసింది నలన్ కుమారస్వామి. అయితే ఈ సినిమాకు నలన్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను అనుకున్నాడు. కానీ సంతోష్ వచ్చి నేనే వర్క్ చేస్తా అని అడిగి మరీ మూవీకి జాయిన్ అయ్యాడు.⇢ హీరోయిన్ కృతిశెట్టి ఆకట్టుకునేలా నటించింది. స్పిరిట్ రీడర్ లా ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం రీసెర్చ్ చేసి, ప్రిపరేషన్ తో పర్ ఫార్మ్ చేసింది. ఫస్ట్ సీన్ చూసి నేను ఎంత బాగా నటిస్తుంది అనుకున్నా. హీరోయిన్ అంటే కొన్నిసార్లు గ్లామర్ డాల్ లా ఉండాల్సివస్తుంది. కానీ కృతి నటిగా ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె డ్యాన్సులు, గ్లామర్ కాకుండా మంచి యాక్టర్ లా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది.⇢ నేను టీమ్ వర్క్ ను బిలీవ్ చేస్తాను. దర్శకుడితో కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేసుకుంటాం. సెట్ లో సీన్ చేసే ముందు కూడా మాట్లాడుకుంటాం. నాకు అనిపించిన సజెషన్స్ చెబుతాను. నేను క్యారెక్టర్ లో ఉండిపోతాను కాబట్టి ఆ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. నావంతు కాంట్రిబ్యూషన్ తప్పకుండా చేస్తుంటా.⇢ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మూవీకి ఏం కావాలన్నా చేశారు. అన్నగారు వస్తారులో కొత్త వరల్డ్ క్రియేట్ చేశామంటే అందుకు జ్ఞానవేల్ రాజా ఇచ్చిన సపోర్ట్ కారణం. ఒకవారం రెండు మూడు సినిమాలు వచ్చినా తప్పులేదు. ప్రేక్షకులు ఒక మూవీ తర్వాత మరొక మూవీ చూస్తారు. నేనూ ఒక ఆడియెన్ గా అలాగే చూసేవాడిని. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు ఉంటారు.⇢ ఎవరు కొత్త తరహా సినిమా చేసినా కనీసం మన వంతు ప్రోత్సాహం అందించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు. సత్యం సుందరం లాంటి సినిమాను ఒకవేళ ప్రేక్షకులు ఆదరించకుంటే మరోసారి అలాంటి సినిమా చేసే ప్రయత్నమే ఎవరు చేయరు కదా. అఖండ 2 రిలీజ్ కన్ఫమ్ కావడం హ్యాపీగా ఉంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. కె విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లోని భావోద్వేగాలు, పాత్రల చిత్రణ అద్భుతంగా ఉంటాయి. విశ్వనాథ్ గారి సినిమాలు ఎప్పుడు చూసినా మనల్ని ఎంగేజ్ చేస్తుంటాయి. -
‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ నమ్మకంతోనే కోలీవుడ్ వెళ్లాను: సందీప్ కిషన్
‘‘యంగ్ హీరోలు ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు చేయాలని కోరుకునే మూడు సినిమాల్లో తప్పకుండా ఒకటి కార్తీ అన్నది ఉంటుంది. ఆయన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు.. నన్ను తమిళ ప్రేక్షకులు ఇష్టపడరా? అనే నమ్మకంతోనే కోలీవుడ్ వెళ్లాను. అక్కడ నాకు ప్రతిసారీ తన సపోర్ట్ అందిస్తుంటారు కార్తీ అన్న. ఆయన చేసిన ‘అన్నగారు వస్తారు’ సినిమా విజయం సాధించాలి’’ అని హీరో సందీప్ కిషన్ తెలిపారు. కార్తీ హీరోగా, కృతీశెట్టి హీరోయిన్గా నటించిన చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 12న తెలుగులో విడుదలవుతోంది.హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అన్నగారు వస్తారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ బాబీ(కేఎస్ రవీంద్ర), వెంకీ కుడుముల, శివ నిర్వాణ, దేవ కట్టా, వివేక్ ఆత్రేయ, రాహుల్ రవీంద్రన్, శైలేష్ కొలను, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథులుగా హాజరై, ‘అన్నగారు వస్తారు’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాత ‘బన్నీ’ వాస్ మాట్లాడుతూ–‘‘సూర్య, జ్ఞానవేల్ రాజాగార్లతో మాకు మంచి అనుబంధం ఉంది. కార్తీగారి మీద ఉన్న అభిమానం వల్లే ఈ వేడుకకి ఇంతమంది యంగ్ డైరెక్టర్స్ వచ్చారు. ‘అన్నగారు వస్తారు’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని చెప్పారు.‘‘ఈ సినిమాను మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూషన్ శశిధర్. ‘‘తమిళంలో నా తొలి చిత్రంతోనే కార్తీగారితో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అని కృతీశెట్టి పేర్కొన్నారు. కార్తీ మాట్లాడుతూ–‘‘ఎన్టీఆర్, ఎంజీఆర్గార్లు సినిమాను, రాజకీయాలను, ప్రజా జీవితాలను మార్చేశారు. వారు మనకు సూపర్ హీరోస్. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు తిరిగొస్తే ఎలా ఉంటుంది? అనేది ‘అన్నగారు వస్తారు’ సినిమా కథ’’ అన్నారు. -
గతవారం నిల్.. ఈసారి ఏకంగా థియేటర్లలోకి 15 సినిమాలు
టాలీవుడ్లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు ఉంటుంది. గతవారం చూసుకుంటే 'అఖండ 2' రిలీజ్ అవుతుందని ఒక్కరంటే ఒక్కరు కూడా వేరే మూవీని విడుదలకు ప్లాన్ చేసుకోలేదు. దీంతో వీకెండ్ పూర్తిగా వృథా అయిపోయింది. ఈ వారం ఏమో ఏకంగా 15 చిన్నా చితకా మూవీస్ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవేంటి? వీటిలో చూడదగ్గవి ఏవి?పేరుకే ఈ వారం 15 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. మూడు మాత్రమే కాస్త చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వాటిలో కార్తి 'అన్నగారు వస్తారు' అనే డబ్బింగ్ చిత్రం ఒకటి కాగా.. యాంకర్ సుమ కొడుకు రోషన్ 'మోగ్లీ', నందు 'సైక్ సిద్ధార్థ్' ఉన్నంతలో చూడొచ్చేమో అనిపిస్తున్నాయి. వీటికి కూడా పెద్దగా గొప్ప హైప్ ఏం లేదు. హిట్ టాక్ వస్తే తప్ప వీటిపై ప్రేక్షకులు దృష్టిపెట్టరు.(ఇదీ చదవండి: హోటల్ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి)ఈ మూడు కాకుండా విడుదలయ్యే మిగతా సినిమాల విషయానికొస్తే సకుటుంబానాం, ఈషా, నా తెలుగోడు, పైసావాలా, ఫెయిల్యూర్ బాయ్స్, వన్ బై ఫోర్, ఘంటసాల, ఇట్స్ ఓకే గురు, కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్, డ్రైవ్, లాక్ డౌన్, ఎవడి సినిమాకు వాడే హీరో.. ఇలా బోలెడన్ని ఉన్నాయి. అసలు వీటిలో ఎన్ని మూవీస్.. ఈ వారం వస్తున్నాయని ప్రేక్షకులకు తెలుసో లేదో కూడా తెలియదు.ఇలా వస్తే వారంలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి. లేదంటే ఒక్కటి కూడా రిలీజ్ కాకుండా ఖాళీగా ఉంటుంది. ఈ విషయమై టాలీవుడ్ నిర్మాతలు కూర్చుని మాట్లాడుకోకపోతే రాబోయే రోజుల్లో చిన్న సినిమాలకే నష్టం. ఇప్పటికే ఓటీటీల తీరు వల్ల చిన్న బడ్జెట్, మీడియం రేంజ్ హీరోల సినిమాలని థియేటర్లకు వెళ్లి జనాలు చూడటం చాలావరకు తగ్గించేశారు. ఇలా ఇన్నేసి సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం చేస్తే జనాలయినా ఎందుకొస్తారు చెప్పండి? (ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
హోటల్ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి
సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు చెప్పే విషయాలు నమ్మాలా వద్దా అనే సందేహాలు రేకెత్తిస్తుంటాయి. 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి.. కొన్నాళ్ల క్రితం తనకు జరిగిన వింత అనుభవం గురించి బయటపెట్టింది. తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మ లాంటి రూపం కనిపించిందని చెప్పుకొచ్చింది. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టింది.'కార్తీ వా వాతియర్ (అన్నగారు వస్తారు) షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చింది. తర్వాత ఆత్మ కనిపించలేదు. మరి అది నాకు సాయం చేయడానికి వచ్చిందో లేదంటే నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు. నాకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకముంది. ఎందుకంటే నేను తుళు జాతికి చెందిన అమ్మాయిని. మా పూర్వీకులని దేవతలుగా పూజిస్తాం. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతుంటారని నమ్ముతుంటాం. ఈ సంఘటన వల్ల ఆ నమ్మకం మరింత బలపడింది' అని కృతి శెట్టి చెప్పింది.(ఇదీ చదవండి: ఈ పాపని గుర్తుపట్టారా? తండ్రి స్టార్ హీరో.. తల్లి, అక్క హీరోయిన్సే)కార్తీ హీరోగా ఈమె నటించిన లేటెస్ట్ తమిళ మూవీ 'వా వాతియర్'. దీన్ని తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కార్తీ.. పోలీసుగా చేస్తుండగా, కృతిశెట్టి.. ఆత్మలతే మాట్లాడే జిప్సీ తరహా పాత్రలో కనిపించనుంది. అయితే కృతి చెప్పింది చూస్తుంటే ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పినట్లు అనిపిస్తుంది. మరి నిజంగా ఈమెకు ఆత్మ కనబడిందో లేదంటే కల్పించి చెబుతోందా?కృతి కెరీర్ విషయానికొస్తే.. 'ఉప్పెన'తో సూపర్ హిట్ అందుకుంది. కానీ తర్వాత తెలుగులో చేసిన దాదాపు సినిమాలన్నీ ఫెయిల్. దీంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. కానీ కోలీవుడ్‌లో కూడా ఈమె చేసిన చిత్రాలు పలు కారణాల వల్ల ఆలస్యమైపోయాయి. ఈ మూవీ కూడా రెండు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉండి, ఇప్పుడు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా) -
ఆల్రెడీ నే రిచ్ కిడ్డు...
అన్నగారు థియేటర్లకు వచ్చే తేదీ ఖరారైపోయింది. కార్తీ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. ఈ చిత్రం ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ కానుంది. ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా బుధవారం ప్రకటించారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కృతీ శెట్టి కథానాయికగా నటించారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన విషయాన్ని ప్రకటించి, ‘అన్నగారు’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా, ఎస్.పి. అభిషేక్, హరిప్రియ ఆలపించారు. ‘‘అన్నగారు, అన్నగారు... ఆల్రెడీ నే రిచ్ కిడ్డు, పాన్ ఇండియా మూవీ ΄్లాన్ చేశా, రాజమౌళికి ఫోన్ చేసి నా మీద బయోపిక్ ఒకటి తీయమంటున్న...’ అంటూ కలర్‌ఫుల్ మేకింగ్‌తో ఈ పాట అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
అన్నగారు పోలీసాఫీసర్
కార్తీ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో రానుంది. డిసెంబరులో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు టీజర్‌ని డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.‘‘టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. కార్తీ, జ్ఞానవేల్ రాజాతో పాటు చిత్రయూనిట్‌కి అభినందనలు’’ అని అనిల్ రావిపూడి తెలిపారు. ‘‘యాక్షన్ కామెడీ కథతో రూపొందిన చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈ మూవీలో కార్తీపోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్ రిలీజ్
కార్తీ.. పేరుకే తమిళ హీరో గానీ మన దగ్గర బోలెడంత మంది అభిమానులున్నారు. దీంతో తన సినిమాలు వచ్చేటప్పుడు తెలుగు రిలీజ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. గతేడాది 'సత్యం సుందరం' అనే మూవీతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'అన్నగారు వస్తారు' చిత్రంతో రాబోతున్నాడు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)'అన్నగారు వస్తారు'లో కార్తీ.. కాస్త ఫన్ ఎలిమెంట్స్ ఉండే పోలీస్ అధికారిగా కనిపిస్తాడని టీజర్ బట్టి తెలుస్తోంది. కృతిశెట్టి హీరోయిన్. నలన్ కుమారస్వామి దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశముంది. టీజర్‌ను టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. డైలాగ్స్ ఏం లేనప్పటికీ.. టీజర్ ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది.(ఇదీ చదవండి: 'పుష్ప' రిలీజ్.. ఏడాది వరకు అల్లు అర్జున్‌కు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదు: నిర్మాత)


