కార్తీ సినిమా ఫైనల్‌ కలెక్షన్స్‌.. ఎవరూ ఊహించలేరు | Karthi Latest Annagaru Vostaru Movie Final Box Office Collections And OTT Release Streaming Platform | Sakshi
Sakshi News home page

అన్నగారు భారీగానే నష్టాలిచ్చారు.. అందుకే ఓటీటీ

Jan 29 2026 9:26 AM | Updated on Jan 29 2026 10:09 AM

Karthi Movie Annagaru Vostaru Final Collection and OTT

కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం 'అన్నగారు వస్తారు' డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది . సంక్రాంతి కానుకగా తమిళ్‌లో 'వా వాత్తియార్‌' పేరుతో జనవరి 14న విడుదలైంది. కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి కూడా ఈ మూవీ జనవరి 28న వచ్చేసింది. అందుకు ప్రధాన కారణం ఈ మూవీ కలెక్షన్స్‌ అని తెలుస్తోంది.  కార్తీ కెరీర్‌లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా  'అన్నగారు వస్తారు' నిలిచింది. నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించి ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా తమిళనాట ఎంట్రీ ఇచ్చింది.

'అన్నగారు వస్తారు' (వా వాతియార్) భారీ డిజాస్టర్‌గా నిలిచింది.   తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పనితీరు చాలా దారుణంగా ఉంది. యాక్షన్-కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం  కేవలం రూ. 9 కోట్ల కలెక్షన్స్‌ మాత్రమే రాబట్టింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఏకంగా రూ. 40 కోట్ల​ మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేసులో ఈ మూవీ ఉన్నప్పటికీ పెద్దగా రిటర్న్‌ చేయలేదు. కార్తీ వంటి స్టార్‌ హీరోకు ఇలాంటి కలెక్షన్స్‌ రావడంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. వారంలోనే ఈ మూవీని తమిళనాడు వ్యాప్తంగా తొలగించేశారు. బాక్సాఫీస్ వద్ద దారుణమైన ప్రదర్శన కారణంగా, నష్టాలను తగ్గించడానికి వా వాతియార్ నిర్మాతలు త్వరగా డిజిటల్ విడుదలను చేశారని తెలుస్తోంది. ఓటీటీ ద్వారా కాస్త నష్టాలను తగ్గించుకునే పనిలో నిర్మాతలు విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement