దురంధర్‌-2 మూవీ.. ప్రీమియర్స్‌తోనే ఆల్‌టైమ్ రికార్డ్..! | Dhurandhar 2 breaks all premiere records with Rs 52 crore | Sakshi
Sakshi News home page

Dhurandhar 2: దురంధర్‌-2 మూవీ.. ప్రీమియర్స్‌తోనే ఆల్‌టైమ్ రికార్డ్..!

Mar 19 2026 7:31 PM | Updated on Mar 19 2026 7:36 PM

Dhurandhar 2 breaks all premiere records with Rs 52 crore

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్‌-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దురంధర్ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీమియర్స్ షోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టికెట్స్ రిలీజైన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

తాజాగా ప్రీమియర్ షోల కలెక్షన్స్‌లో దురంధర్‌-2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా రూ.52 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ ప్రీమియర్ షోలను దేశవ్యాప్తంగా దాదాపు 12000 వేలకు పైగా షోలు ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్‌ ప్రీమియర్స్‌లో ‍అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనత సాధించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను దురంధర్-2 అధిగమించింది. ఈ చిత్రంలో  ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement