కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం 'అన్నగారు వస్తారు' డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుంది . ఇప్పటికే తమిళ్ వర్షన్‌లో ‘వా వాత్తియార్’ పేరుతో సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. అయితే, తెలుగులో థియేటర్స్ దొరకకపోవడంతో టాలీవుడ్‌లో విడుదల కాలేదు. దీంతో తెలుగు వర్షన్‌ను ఓటీటీలోనే డైరెక్ట్‌గా విడుదల చేస్తున్నారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించి ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా తమిళనాట ఎంట్రీ ఇచ్చింది. మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా అన్నగారు వస్తారు (అన్నగారు వస్తారు) మూవీ విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


