బీ-టౌన్ డిజైనర్ల ఫేవరెట్ ఐకాన్‌గా అల్లు అర్జున్! | Bollywood Fashion Designers Interest To Design For Allu Arjun | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ ఫ్యాషన్‌ డిజైనర్లకు ఫేవరెట్‌ బన్నీ...

Mar 13 2026 1:09 PM | Updated on Mar 13 2026 1:42 PM

Bollywood Fashion Designers Interest To Design For Allu Arjun

స్టైలిస్ట్‌ ‘ఐకాన్‌’ స్టార్‌ కు డిజైన్‌ చేయాలని తహతహ..

ఇది నిజంగా అరుదైన విషయమే అని చెప్పాలి. ఒక టాలీవుడ్‌ హీరో బాలీవుడ్‌ ఫ్యాషన్‌ డిజైనర్లకు ఫేవరెట్‌ గా మారడం అనేది అంత ఈజీ కాదు. రజనీకాంత్‌ రోబో దగ్గర నుంచి గత కొంతకాలంగా మన దక్షిణాది సినిమాలు మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయి కలెక్షన్లు సాధిస్తుండవచ్చు గాక. కానీ మన టాలీవుడ్‌ హీరోలలో ఎవరూ  బాలీవుడ్‌  ఫ్యాషన్‌ ఇండస్ట్రీని అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మొన్నటి హృతిక్‌ రోషన్, జాన్‌ అబ్రహాంలతో మొదలుకుని నిన్నటి రణవీర్‌ సింగ్, టైగర్‌ ష్రాఫ్‌...తదితర టాప్‌ స్టార్స్‌ వెంటే క్యూ కట్టే సంప్రదాయం బాలీవుడ్‌ డిజైనర్స్‌ ది. అలాంటిది తొలిసారిగా ఉత్తరాది ఫ్యాషన్‌ పరిశ్రమ ఒక టాలీవుడ్‌ స్టార్‌ అంటే అమితాసక్తి చూపిస్తోంది. అతడే మన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

ఆరంభం నుంచే తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అల్లు అర్జున్‌ తొలిదశలోని  దేశముదురు, హ్యాపీ, ఆర్య, ఇద్దరమ్మాయిలతో...వంటి సినిమాల్లో బన్నీ స్టైల్స్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. అలా తన సినిమాల ద్వారా స్టైలిష్‌ స్టార్‌ అనే సరికొత్త కిరీటాన్ని కూడా అయితే తెలుగులో ఆయన్ను స్టైలిష్‌ స్టార్‌గా చేసిన సినిమాలన్నింటిలోనూ బన్నీ.. అత్యాధునిక స్టైల్స్‌ చూపాడు కాబట్టి ఓకే.. అయితే కాస్త వంకరగా నడుస్తూ, ఊర మాస్‌ డ్రెస్సులు వేసుకున్న పుష్పరాజ్‌ గా ఆయన బాలీవుడ్‌ డిజైనర్లకు ఫేవరెట్‌గా మారడం విశేషం.

ఇటీవల పలు సందర్భాల్లో అల్లు అర్జున్‌ ధరిస్తున్న డ్రెస్‌లు అన్నీ టాక్‌ ఆఫ్‌ ద ఫ్యాషన్‌ ఇండస్ట్రీగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్‌ టాప్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన బ్లాక్‌ వెల్వెట్‌ షెర్వానీ లాంటివి బాలీవుడ్‌ స్టార్స్‌ కనుబొమలు ఎగరేసేలా చేశాయి.  

నీహారిక కొణిదెల డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం దాదాపు రూ.3లక్షలు విలువ చేసే ఈ ఎత్నిక్‌ వేర్‌ను అల్లు అర్జున్‌ ధరించాడు. ఈ డ్రెస్‌ తో బన్నీ స్టైల్‌ వైరల్‌గా మారిపోయింది. అలాగే ఇటీవలి కాలంలో స్టార్‌ డిజైనర్‌గా దూసుకొచ్చిన అశ్విన్‌ మావ్‌లే కూడా పలు ప్రత్యేక సందర్భాల్లో బన్నీకి డిజైన్స్‌ క్రియేట్‌ చేశాడు. తాజాగా తన వెడ్డింగ్‌ యానివర్సరీ, అల్లు శిరీష్‌ పెళ్లి వేడుకల సందర్భంగా బన్నీ డ్రెస్సింగ్‌ స్టైల్స్‌ నెట్టింట్‌ సెన్సేషన్‌ గా మారాయి.

దాంతో దేశంలోని టాప్‌ డిజైనర్లు అందరికీ అల్లు అర్జున్‌ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌గా మారాడు.   మరోవైపు బాలీవుడ్‌ మేగ్‌జైన్స్, వెబ్‌సైట్స్‌ అక్కడి స్టార్స్‌తో సమానంగా ఇంకా చెప్పాలంటే వారికన్నా మిన్నగా అల్లు అర్జున్‌ స్టైల్స్‌కి పెద్ద పీట వేస్తున్నాయి. ఇటీవలే తరుణ్‌ తహిల్యానీ, శంతను నిఖిల్, సబ్యసాచి తదితర టాప్‌ ఫ్యాషన్‌ డిజైనర్స్‌ హైదరాబాద్‌లోనూ బొటిక్స్‌ ప్రారంభించిన నేపధ్యంలో దక్షిణాదిలో ప్రమోషన్స్‌ కోసం చూస్తున్న వీరందరికీ అల్లు అర్జున్‌ బెస్ట్‌ ఛాయిస్‌గా కనిపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో ఐకాన్‌స్టార్‌ నేషనల్‌ స్టైలిష్‌ స్టార్‌గా కిరీటం దక్కించుకోవడం తధ్యంగా కనిపిస్తోంది

Advertisement
 
Advertisement
Advertisement