హాలీవుడ్‌తో పోటీ పడదాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Attends Inauguration of Allu Arjun Allu Cinemas at Kokapet | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌తో పోటీ పడదాం: సీఎం రేవంత్‌

Mar 13 2026 5:32 AM | Updated on Mar 13 2026 5:32 AM

CM Revanth Reddy Attends Inauguration of Allu Arjun Allu Cinemas at Kokapet

అల్లు సినిమాస్‌ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్‌ తదితరులు

అల్లు సినిమాస్‌ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు సినిమా హాలీవుడ్‌తో పోటీ పడాలని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు మన సినిమా లు బాలీవుడ్‌తో పోల్చుకునే వారిమని, కానీ ఇప్పుడు టాలీవుడ్‌ సినిమాల స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్నారు. ఇప్పు డు మన సినిమాలు కేవలం హాలీవుడ్‌ సినిమాలతో పోటీ పడుతున్నాయని, అంతటి ప్రమాణాలతో తెలుగు సినిమా అభివృద్ధి చెందిందన్నారు. కోకాపేట్‌లో నిర్మించిన అల్లు అర్జున్‌ థియేటర్‌ ఆఫ్‌ అల్లు సినిమాస్‌ను గురువారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

‘తెలుగు సినీ పరిశ్రమ దేశంలో ముందువరుసలో ఉంది. అత్యంత ఉత్తమ చిత్రాలను మన పరిశ్రమ నిర్మిస్తోంది. బాహుబలి, కలి్క, అరుంధతి లాంటి సినిమాలు టాలీవుడ్‌కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో ఆ సినిమాలు నిర్మించారు. కలెక్షన్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీగా నిలిచాయి. సినిమా రంగం సాంకేతికంగా అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ప్రేక్షకులను కట్టిపడేసే సినిమాలు వస్తున్నా యి. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ధియేటర్‌ నిర్మించారు. నేను సినిమా అభిమానిని. అందులోనూ కృష్ణ అభిమానిని. కాలేజీ రోజుల్లో మా ప్రాంతంలో సినిమా థియేటర్లు లేవు. వనపర్తి, కర్నూలుకు వెళ్లి సినిమా చూసేవాడిని. లారీఎక్కి సినిమాలు చూశాను. నటుడు కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారు. ఇప్పు డు ఐదారేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. సినిమా సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.

సినిమాల్లో కథ, కథనం ఆధారంగా మన జీవితంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎన్‌టీ ఆర్‌ అక్కినేని, రామానాయుడు లాంటి వాళ్లు తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కానీ నటుడు కృష్ణ మాత్రం సాహసాలు చేసారు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభు త్వం అండగా ఉంటుంది. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీ మాదిరిగా సినీ ఇండస్ట్రీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. మన సినిమాలు హాలీవుడ్‌ స్థాయికి వెళ్ళాలి. భాష అడ్డంకి కాదు. కేవలం టాలెంట్‌ మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది.’అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దిల్‌ రాజు, సినీ నిర్మాత అల్లు అరవింద్, నటుడు అల్లు అర్జున్, అల్లు వెంకట్, అల్లు శిరీష్‌  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement