నామకరణ ఫంక్షన్‌.. చెల్లి కోసం వితికా సర్‌ప్రైజ్‌ | Vithika Sheru Sister Krithika Sheru Son Naming Ceremony, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Vithika Sheru: వితికా చెల్లి కొడుకు నామకరణ ఫంక్షన్‌.. ఏం పేరు పెట్టారంటే?

Mar 13 2026 8:32 PM | Updated on Mar 14 2026 3:38 PM

Vithika Sheru Sister Krithika Sheru Son Naming Ceremony

హీరోయిన్‌, బిగ్‌బాస్‌ బ్యూటీ వితికా షెరుకు ఎవరైనా నచ్చారంటే వారికోసం ఏమైనా చేస్తుంది. భర్త కోసం ఇల్లు కట్టి గిఫ్ట్‌ ఇచ్చింది. చెల్లికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా సీమంతం చేసింది. స్నేహితురాలు, మెగా డాటర్‌ నిహారిక ఉండే ఇంట్లో ఆమెకోసం ఓ గదిని ప్రత్యేకంగా అలంకరించి సర్‌ప్రైజ్‌ చేసింది. ఇలా ఎప్పుడూ నా అనుకునేవారికోం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది.

కృతికాకు పండంటి బాబు
ఇకపోతే 2025 డిసెంబర్‌లో వితికా పెద్దమ్మగా ప్రమోషన్‌ పొందింది. నటి సోదరి కృతికా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆ పిల్లవాడి నామకరణ వేడుక జరిగింది. ఆ విషయాన్ని వితికా సిస్టర్స్‌ ఆలస్యంగా సోషల్‌ మీడియాలో వెల్లడించారు. బాబుకు జైవీర్‌ కార్తికేయ అని నామకరణం చేసినట్లు కృతిక కొన్ని ఫోటోలు రిలీజ్‌ చేసింది. వితిక అయితే.. ఊయల ఫంక్షన్‌ కోసం దగ్గరుండి డెకరేషన్‌ చేయించింది. 

నామకరణ వేడుక
పూలతో వెంకటేశ్వస్వామిని ఆవిష్కరించింది. అది చూసి కృతిక ఆశ్చర్యపోయింది. తనకోసం ఇంత కష్టపడిందా? అని తెగ సంతోషపడిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నీలాంటి అక్క దొరికినందుకు కృతిక చాలా అదృష్టవంతురాలు అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వరుణ్‌ సందేశ్‌- వతిక 'ధర్మస్థల నియోజకవర్గం', 'డియర్‌ ఆస్ట్రోనాట్‌' సినిమాలు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement