అల్లు కుటుంబం నుంచి మరొకరు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ఒక్కరు మరెవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్. ఇప్పటికే తన మాటలు, ప్రవర్తనతో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయాడు. ఈ మధ్యే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడు. అయితే తను కూడా హీరో అవుతానంటున్నాడట!
వేషాలు వేస్తున్నాడు
ఈ విషయాన్ని స్వయంగా బన్నీ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించాడు. అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ వేడుకలో అరవింద్ మాట్లాడుతూ.. మా నాన్న, నేను, బన్నీయే కాదు.. వాళ్లబ్బాయి అయాన్ కూడా ఈ ఇండస్ట్రీలోనే ఉంటాడు. ఆల్‌రెడీ వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు.
ఎంట్రీ ఎప్పుడో?
మా నాలుగు జనరేషన్స్ ఈ ఇండస్ట్రీపైనే ఉన్నాయి. అలాంటి చిత్రపరిశ్రమకు ఏదైనా తిరిగివ్వాలన్న సంకల్పంలో నుంచి పుట్టిందే అల్లు సినిమాస్ అని పేర్కొన్నాడు. మరి అయాన్ బాలనటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇస్తాడా? లేదా పెరిగి పెద్దయ్యాక నేరుగా హీరోగా పరిచయమవుతాడా? చూడాలి!
అల్లు అర్జున్ వాళ్ల అబ్బాయి కూడా వేషాలు వేస్తానని. ఇంట్లో వేషాలు వేస్తున్నాడు
- #AlluAravind about #AlluAyaan at #AlluCinemas launch pic.twitter.com/F1JvV9FieK— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) March 12, 2026


