పూరి జగన్నాధ్ కూతురును చూశారా.. ఎంతలా మారిపోయిందో? | Puri Jagannadh Daughter Puri Pavithra Latest Look Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాధ్ కూతురును చూశారా.. ఎంతలా మారిపోయిందో?

Mar 13 2026 4:56 PM | Updated on Mar 13 2026 5:35 PM

Puri Jagannadh Daughter Puri Pavithra Latest Photos Goes Viral

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌ హీరోలంతా ఒక్కసారైనా ఈయనతో సినిమా చేయాలని భావిస్తారు. ముఖ్యంగా మాస్‌, యాక్షన్‌ హీరోగా గుర్తింపు పొందాలంటే పూరీతో సినిమా చేయాల్సిందే. ఆయనలా సీన్స్‌, డైలాగులు రాసే డైరెక్టర్స్‌ ఇండియాలోనే లేరు అని ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోనే చెప్పాడంటే.. పూరీ పెన్‌ పవర్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో సరైన హిట్‌ లేకున్నా..యువతలో పూరీకి ఉన్న క్రేజ్‌ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్, టబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పూరీ ఫోకస్‌ అంతా ఈ మూవీపైనే పెట్టాడు. ఇదిలా ఉంటే.. పూరీ ఇప్పటికే తన వారసుడిని సినిమాల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొడుకు ఆకాష్‌ పూరిని చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేసి..ఆ తర్వాత హీరోగా మార్చాడు. అయితే ఆకాశ్‌ పూరీకి కూడా ఈ మధ్య సరైన హిట్‌ లేదు. తండ్రి కొడుకులిద్దరు ఓ భారీ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు పూరీ తనయ పవిత్ర సైతం సినిమాల్లోకి రాబోతుందనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. బుజ్జిగాడు సినిమాలో పూరి కూతురు పవిత్ర చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు. కానీ ఆమె సినిమాల్లోకి రాబోతుందనే వార్తలు మాత్రం తరచూ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ సారి ఆమె నటిగా కాకుండా.. నిర్మాతగా వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్‌’లో పవిత్ర కూడా నిర్మాతగా  చేర్చాబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే వీటిల్లో నిజమెంత అనేది తెలియదు కానీ..తాజాగా పవిత్రకు సంబంధించిన ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisement
 
Advertisement
Advertisement