66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్‌? నటి ఏమందంటే? | Bollywood Actress Neena Gupta Gives Clarity On Pregnancy Rumours After Appearance At Virosh Reception, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Neena Gupta: విరోష్‌ రిసెప్షన్‌లో నటి.. ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై..

Mar 13 2026 3:05 PM | Updated on Mar 13 2026 3:30 PM

Neena Gupta Pregnant a 66? Actress Gives Clarity

సెలబ్రిటీలు ఎలా రెడీ అవుతున్నారు? బరువు పెరిగారా? తగ్గారా? ముఖం కళకళలాడుతోందా? కళ తప్పిందా? హుషారుగా ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఇలా ప్రతీది కళ్లతోనే స్కానింగ్‌ చేస్తున్నారు సోషల్‌ మీడియా నెటిజన్స్‌. వారి కంటికి ఏదైనా ఫోటో, వీడియో కనిపిస్తే చాలు.. ఏవేవో ఊహించుకుంటున్నారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటి నీనా గుప్తా విషయంలోనూ అలాగే అతిగా ఊహించుకున్నారు.

విరోష్‌ రిసెప్షన్‌లో..
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విరోష్‌ (విజయ్‌ దేవరకండ- రష్మిక మందన్నా) రిసెప్షన్‌కు నీనా గుప్తా, భర్త వివేక్‌తో కలిసి హాజరైంది. స్టైలిష్‌గా తెల్ల చీర కట్టుకున్న ఆమె మెడకు బంగారు నెక్లెస్‌ ధరించింది. కాకపోతే కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. ఇంకేముంది సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. 66 ఏళ్ల వయసులో నీనా గర్భం దాల్చిందా? ఇది నిజమేనా? అని ఆరా తీస్తున్నారు.

ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై క్లారిటీ
దీంతో ఈ రూమర్స్‌పై తాజాగా నీనా గుప్తా స్పందించింది. ఇదేమైనా బదాయి హో సినిమా (ఈ మూవీలో లేటు వయసులో ఓ మహిళ తల్లవుతుంది) అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. నేను గర్భవతిని కాదు. చీర కాస్త బరువుగా ఉంది. అందువల్లే నేను కూడా మీకు లావుగా కనిపించానంతే! ఏదేమైనా ఈ ప్రచారం నన్ను బాధపెట్టడానికి బదులుగా ఆశ్చర్యపరిచింది. ఈ వయసులో ప్రెగ్నెంట్‌ అనుకున్నారంటే మన దేశం ముందుకు పోతున్నట్లే అని పేర్కొంది. నీనా చివగా వధ్‌ 2 మూవీలో యాక్ట్‌ చేసింది.

ప్రేమ- పెళ్లి
నీనా గుప్తా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ను ప్రేమించింది. అయితే అప్పటికే అతడికి భార్యాబిడ్డలున్నారు. అయినప్పటికీ నీనాతో ప్రేమాయణం సాగించాడు. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా గుప్తా జన్మించింది. కానీ నీనా- రిచర్డ్స్‌ మాత్రం పెళ్లి బంధం వరకు వెళ్లకుండానే విడిపోయారు. దాంతో నీనా.. సింగిల్‌ పేరెంట్‌గా మసాబాను పెంచి పెద్ద చేసింది. 2008లో వివేక్‌ మెహ్రాను పెళ్లాడింది.

 

 చదవండి: గుండె ముక్కలు.. హీరో బ్రేకప్‌ పోస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement