గుండె ముక్కలైందన్న హీరో! బ్రేకప్‌ పోస్ట్‌? | Arjun Das Heartbreaking Post In Social Media Goes Viral | Sakshi
Sakshi News home page

Arjun Das: అంతలా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు? హీరో బ్రేకప్‌ పోస్ట్‌!

Mar 13 2026 2:26 PM | Updated on Mar 13 2026 2:38 PM

Arjun Das Heartbreaking Post In Social Media Goes Viral

తమిళ హీరో అర్జున్‌దాస్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పుడూ సినిమా అప్‌డేట్స్‌ తప్ప పర్సనల్‌ విషయాలను పెద్దగా ఫ్యాన్స్‌తో పంచుకోడు. అలాంటిది ఆయన హార్ట్‌ బ్రేక్‌ అయినట్లు ఓ పోస్ట్‌ పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

అంతలా ప్రేమిస్తే..
ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. మనం ఎవర్నైనా గాఢంగా ప్రేమిస్తే.. వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్‌ ఆన్‌ అవుతారు? అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. దీనికి హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశాడు. 

అర్జున్‌దాస్‌కు బ్రేకప్‌
ఇది చూసిన అభిమానులు అర్జున్‌దాస్‌కు బ్రేకప్‌ అయిందా? అని చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో కొత్త సినిమా ప్రమోషన్స్‌ అయుంటుంది, అంతా పబ్లిసిటీ స్టంట్‌ అని భావిస్తున్నారు. మరి ఈ పోస్ట్‌ వెనక మర్మమేంటో అర్జున్‌ దాసే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

సినిమా
కాగా అర్జున్‌ దాస్‌ గతంలో ఐశ్వర్య లక్ష్మితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్‌ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు. ఇకపోతే ఇతడు చివరగా ఓజీ సినిమాలో యాక్ట్‌ చేశాడు. ప్రస్తుతం కాన్‌ సిటీ సినిమా చేస్తున్నాడు.

చదవండి: ఆశను కోల్పోవద్దు.. విడాకుల తర్వాత హన్సిక ఫస్ట్‌ పోస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement