నటి సంభావన సేత్.. భోజ్‌పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్‌బాస్, రాజ్ పిచ్లే జనం కా, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్‌కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.
రెండో సీజన్‌లో పార్టిసిపేషన్
అయితే తనకు ఓ స్టార్ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్నాను. నాలుగో సీజన్‌లో స్టేజీపై పర్ఫామెన్స్ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్.. నేను భోజ్‌పురిలో మంచి పేరున్న డ్యాన్సర్ అని సల్మాన్ ఖాన్‌కు పరిచయం చేశాడు.
ఫోన్ నెంబర్ కూడా..
అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు.
ఏడ్చుకుంటూ వెళ్లా.
సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్ ఖాన్ అభిమానినే అని చెప్పుకొచ్చింది.


