'ఆయా షేర్' కోసం ఇంత కష్టమా?.. మేకింగ్‌ విశేషాలివే! | The Paradise Movie Makers Build an Empire in Slums for Aaya Sher Song | Sakshi
Sakshi News home page

'ఆయా షేర్' కోసం 2.5 ఎకరాల్లో భారీ సెట్‌..100 ట్యాంకర్ల నీళ్లు, 60 ఇళ్లు!

Mar 13 2026 6:14 PM | Updated on Mar 13 2026 6:32 PM

The Paradise Movie Makers Build an Empire in Slums for Aaya Sher Song

‘ఆయా షేర్‌..’ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్‌’లోని ఈ పాట ఇప్పుడు సోషల్‌ మీడియాతో పాటు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. నాని వేసిన హుక​్‌ స్టెప్‌కి చిన్న, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రీల్స్‌ చేస్తున్నారు. సాహిత్యంపై పట్టున్నవాళ్లు లిరిక్స్‌పై, డ్యాన్స్‌పై అవగాహన ఉన్నవాళ్లు..నాని స్టెప్పులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ పాటలో కనిపించిన విజువల్స్‌ మరోఎత్తు. ఈ పాటలో హీరోని మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం అంతా ఇంతా కాదు. హీరోను మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సెట్‌ను నిర్మించారట. 

ఇందులో ప్రధాన ఆకర్షణగా హీరో హౌస్ (కమాన్ సెట్) నిలిచింది. దీన్ని 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు, 25 అడుగుల లోతుతో నిర్మించారట. అంతేకాదు ఇందులో చూపించిన ఇళ్లను నిజంగానే నిర్మించారట. సాధారణంగా సినిమాల్లో ఇళ్ల సెట్లు అంటే డమ్మీ స్ట్రక్చర్స్ వాడుతుంటారు. కానీ ఈ సాంగ్‌లో వాటర్ బాడీ విలేజ్ సెట్ కోసం 60 అసలైన ఇళ్లను నిర్మించినట్లు మేకర్స్‌ తెలిపారు. దాదాపు 50 మంది పనివారు 30 రోజుల పాటు శ్రమించి ఈ విలేజ్ సెట్‌ను రూపొందించారు. 

ఇక ఈ పాటలో కనిపించే భారీ బిర్యానీ బౌల్‌ని రెడీ చేయడానికి ఏడు మంది దాదాపు ఐదు రోజుల పాటు కష్టపడ్డారట.  దీనికి పాత కాలపు లుక్ రావడం కోసం ప్రత్యేకమైన 'ఏజింగ్ టెక్నిక్స్' వాడటం విశేషం. సినిమాలోని సహజత్వం కోసం 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో ఒక డంప్ యార్డ్ సెట్‌ను కూడా వేశారు. దీనికోసం 25 మంది సభ్యులు 30 రోజుల పాటు పనిచేశారు. ఇక్కడ నీటి కొలను సృష్టించడానికి 100 ట్యాంకర్ల నీటిని వినియోగించారు. ఇది నిండటానికే ఏడు రోజుల సమయం పట్టిందంటే సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక పాట కోసమే ఈ రేంజ్‌లో సెట్‌ వేశారంటే..ఇక సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చదు. సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నాడు. తనికెళ్ల భరణి,కిల్' ఫేమ్ రాఘవ్ జూయెల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 21న  ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement