నాకు సూర్య సపోర్ట్‌గా నిలిచారు.. ఇలా మరే హీరో ఉండరు: నిర్మాత | KE Gnanavel Raja comments about to suriya | Sakshi
Sakshi News home page

నాపై తప్పుడు ప్రచారం.. నాకు సూర్య సపోర్ట్‌గా నిలిచారు: నిర్మాత

Jan 14 2026 6:51 AM | Updated on Jan 14 2026 6:54 AM

KE Gnanavel Raja comments about to suriya

నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వా వాతియార్‌' తమిళ్‌లో నేడు విడుదల కానుంది. ఇందులో కృతిశెట్టి నాయకిగా నటించింది.  సత్యరాజ్, ఆనంద్‌రాజ్‌ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ. జ్ఞానవేల్‌రాజా  నిర్మించిన ఈ చిత్రానికి నలన్‌ కుమారస్వామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పొంగల్‌ సందర్భంగా  నేడు (బుధవారం) తెరపై రానుంది.

ఈ సందర్భంగా చెన్నైలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు కార్తీ, నటి కృతిశెట్టి , నిర్మాత కేజీ.జ్ఞానవేల్‌ రాజా, సత్యరాజ్, ఆనంద్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ ‘‘ నేను ఎక్కడికి పారిపోలేదు. ఇక్కడే ఉన్నాను. అందరిని ఆనంద పరిచే  చిత్ర పరిశ్రమలోనే ఉంటాను. నా గురించి రక రకాలుగా ప్రచారం చేశారు. అప్పుల పాలయ్యారు అని కూడా ప్రచారం చేశారు. నిజం చెప్పాలంటే సినిమా రంగంలో అప్పు లేని నిర్మాతను నేనే.  నాకు పూర్తి సపోర్ట్‌గా నిలిచిన నటుడు సూర్య అన్నయ్యకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆనందంలోనే కాదు.. కష్ట సమయంలోనూ సూర్య అన్న నాకు తోడుగా ఉన్నారు. ఇలా మరే హీరో ఉండరు. ముఖం ముందు పొగిడి, వెనుక విమర్శించే వారు ఉంటారు, వారి గురించి పట్టించుకోవద్దని హితవు పలికిన ఆయన నాకు పూర్తిగా మద్దతుగా నిలిచారు.  'వా వాతియార్‌' చిత్రం జనరంజకంగా వచ్చింది  ‘‘ అని  పేర్కొన్నారు.

నటుడు కార్తీ మాట్లాడుతూ ‘‘  'వా వాతియార్‌'చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. జ్ఞాన వేల్‌ రాజా చెప్పినట్లు అన్నయ్య సూర్య ఈ చిత్రానికి ఎంతగానో సపోర్ట్‌ గా నిలిచారు. దర్శకుడు నలన్‌ కుమారస్వామి ఈ చిత్ర కథను చెప్పగానే నేను ఇందులో ౠంజీఆర్‌ గా నటించగలనా ?అని భయపడ్డాను. అయితే దర్శకుడు కథను అద్భుతంగా మలిచారు.ఆయన ఇచ్చిన ధైర్యంతో ఈ చిత్రంలో నటించాను. మనం సూపర్‌ మాన్, బ్యాట్‌ మాన్‌ సూపర్‌ హీరోల కల్పిత కథలతో చిత్రాలు చేస్తున్నాం. నిజ జీవితంలో ఎంజీఆర్‌ వంటి హిరోల కథలు చాలా ఉన్నాయి. అలాంటి కథలతో చేసిన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయి. 'వా వాతియార్‌' చిత్రంలో నటించడం నా అదృష్టం ‘‘అని నటుడు కార్తీ పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement