మనశంకర వరప్రసాద్‌గారు మరో రికార్డ్.. అదేంటంటే? | Megastar ManaShankara VaraPrasad Garu New Record In Theatres | Sakshi
Sakshi News home page

ManaShankara VaraPrasad Garu: మనశంకర వరప్రసాద్‌గారు మరో రికార్డ్.. అదేంటంటే?

Mar 3 2026 4:32 AM | Updated on Mar 3 2026 5:01 AM

Megastar ManaShankara VaraPrasad Garu New Record In Theatres

మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మనశంకర వరప్రసాద్‌గారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా అభిమానులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది.

తాజాగా మనశంకర వరప్రసాద్‌గారు మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా 109 థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు నిర్మాణం సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 వేదికగా అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. హీరో వెంకటేశ్‌ ప్రత్యేక పాత్రలో అలరించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement