రాకాస అందర్నీ నవ్విస్తుంది: సంగీత్‌ శోభన్ | Rakasa Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

రాకాస అందర్నీ నవ్విస్తుంది: సంగీత్‌ శోభన్

Mar 3 2026 3:09 AM | Updated on Mar 3 2026 3:09 AM

Rakasa Movie Teaser Launch

నిహారిక, మానస శర్మ, సంగీత్‌ శోభన్‌

సంగీత్‌ శోభన్ , నయన్  సారిక జంటగా మానస శర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘రాకాస’.  జీ స్టూడియోస్‌ సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ పతాకంపై నిహారిక కొణిదెల, ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 3న రిలీజ్‌ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సంగీత్‌ శోభన్  మాట్లాడుతూ–  ‘‘రాకాస’ సినిమా కొత్తగా ఉంటుంది. అందర్నీ నవ్విస్తుంది. ప్రేక్షకులు ఖర్చుచేసే టికెట్‌ డబ్బులకు న్యాయం చేసేలా ఉంటుంది.

నిహారిక, మానసగార్ల వల్లే ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో సంగీత్‌ యాక్టర్‌గా మరింత షైన్  అవుతాడు. థియేటర్స్‌కు వచ్చిన ఆడియన్స్ ను నిరాశపరచం’’ అని చెప్పారు నిహారిక కొణిదెల. ‘‘ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశాం. ప్రేక్షకులు మా సినిమాని సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు మానస శర్మ. ఈ కార్యక్రమంలో జీ5 తెలుగు కంటెంట్‌ హెడ్‌ దివ్య, సంగీత దర్శకుడు అనుదీప్, నటీనటులు రోహిణి, గెటప్‌ శ్రీను మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement