Sangeeth Shoban
-
ఓటీటీకి వచ్చేస్తోన్న మ్యాడ్ స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఆదరగొట్టింది. ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ను పంచుకుంది. ఇంకేందుకు ఆలస్యం ఈ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఇటీవలే ఈ సినిమాలో స్వాతిరెడ్డి అంటూ సాగే క్రేజీ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో హీరోయిన్ రెబా మోనికా జాన్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. The boys are back with double the MADness! 🤪Watch Mad Square on Netflix, out 25 April in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#MadSquareOnNetflix pic.twitter.com/0WGsRj2Sgc— Netflix India South (@Netflix_INSouth) April 21, 2025 మ్యాడ్ స్క్వేర్ అసలు కథేంటంటే..ఈ కథలో పెద్దగా లాజిక్స్ అంటూ ఏమీ ఉండవ్.. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్),లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత విడిపోతారు. కానీ, లైఫ్‌లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ మొదలౌతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడక సమయంలో సడెన్‌గా ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్ మొదలౌతుంది. లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం సెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డూ ఫ్యామిలీ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ఫ్రెండ్ పెళ్లి ఘనంగా చేయాలని దామోదర్, అశోక్, మనోజ్ అనేక ప్లాన్స్ వేస్తుంటారు. వారి హంగామాకు తోడు పెళ్లికూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపుబ్బా నవ్విస్తాయి.తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం నెలకొంటుంది. పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ ఆ కార్యక్రమం ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందని సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లికూతురు వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిశాక లడ్డూ ఇంట్లో జరిగే పంచాయితీ, అక్కడ మ్యాడ్ గ్యాంగ్ చేసే అతి ఫుల్‌గా నవ్విస్తుంది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్‌ను గోవాలో పెద్ద డాన్‌గా ఉన్న మ్యాక్స్ (సునీల్) మనుసులు దొంగలిస్తారు. దానిని లడ్డు బ్యాచ్ చేశారని పోలీసులు అనుమానిస్తారు. దీంతో వారిపై నిఘా ఉంచుతారు.అయితే, ఒక ఘటనలో ఆ లాకెట్ లడ్డు చేతికి దొరుకుతుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లడ్డు బ్యాచ్‌లో ఉన్న ఆ అధికారి ఎవరు..? లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్లిపోయింది...? వారిద్దరూ కూడా గోవాకే ఎందుకు వెళ్తారు..? చివరిగా ఆ లాకెట్ కథ ఏంటి.. ఎవరి వద్ద ఉంటుంది..? ఫైనల్‌గా లడ్డును తన స్నేహితుడే జైలుకు ఎందుకు పంపుతాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
బాక్సాఫీస్ విన్నర్ దిశగా మ్యాడ్! ఏ ఓటీటీలోకి రానుందంటే?
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్.. కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి.. లేదంటే పాతదైనా కొత్తగా చెప్పాలి, జనాలను సీట్లకు అతుక్కుపోయేలా చేయాలి. కథలో లీనమయ్యేలా చేయాలి. మరీ ముఖ్యంగా ఆడియన్స్‌కు వినోదాన్ని అందించాలే తప్ప ఎక్కడా విసుగు పుట్టించకూడదు. ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు నిర్మొహమాటంగా సినిమా ఫ్లాప్.. కాదుకాదు, అట్టర్‌ఫ్లాప్ అని తేల్చి పడేస్తారు. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల తీర్పులో మాత్రం తేడా ఉండదు! అక్టోబర్ 6న దాదాపు 10 దాకా సినిమాలు విడుదలయ్యాయి. పది సినిమాలు.. ఫలితం ఎలా ఉందంటే? వీటిలో రూల్స్ రంజన్, మామా మశ్చీంద్ర, మంత్ ఆఫ్ మధు, ఏందిరా ఈ పంచాయితీ, గన్స్ ట్రాన్స్ యాక్షన్, అభిరామచంద్ర, మ్యాడ్.. ఇలా స్ట్రయిట్ సినిమాలున్నాయి. అలాగే క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800, సిద్దార్థ్ చిన్నా, ఎక్సార్సిస్ట్ అనే డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 800, చిన్నా చిత్రాలు బాగానే ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవలేదు. మరి ఏ సినిమాకు జనాలు జై కొడుతున్నారో తెలుసా? మ్యాడ్. జాతిరత్నాలు తరహాలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతోంది. కలెక్షన్స్ డబుల్.. ఈ మూవీలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక సనిల్ కుమార్, గోపిక ఉద్యన్, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. మ్యాడ్ తొలి రోజు రూ.1.8 కోట్లు రాబట్టగా రెండో రోజు ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించింది. దాదాపు రూ.3 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మ్యాడ్ మూవీకి రెండు రోజుల్లోనే రూ.4.7 కోట్లు వచ్చిపడ్డాయి. బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్న ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. MADness unleashed! 🔥 Day 2 > Day 1 🤩#MAD Grosses over 𝟒.𝟕 𝐂𝐑 in 2 Days! 🥳 Experience the MAD Entertainer of the Year at cinemas near you now! 🕺 🎟 - https://t.co/IrUWNwCYws@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/Jc5GxNBY61 — Sithara Entertainments (@SitharaEnts) October 8, 2023 చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి అంజలి పవన్? వీడియోతో క్లారిటీ ఇచ్చిన నటి -
ఆకట్టుకుంటున్న ‘ప్రేమ విమానం’ ట్రైలర్
భావోద్వేగాలు మనిషిని ముందుకు నడిపిస్తాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో ఎమోషన్ ఉంటుంది. అది సాధిస్తే చాలు అనుకుంటారు వాళ్లు. బయట నుంచి చూసే వారికి ఇదేంటని అనిపించినా.. వారికి మాత్రం అదే ముఖ్యమనిపిస్తుంది. అలాంటి ఎమోషన్స్ ఉన్న కొందరి మనుషుల కథతో రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘ప్రేమ విమానం’. సంతోష్ కటా దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 13న జీ 5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ దీన్ని రూపొందిస్తున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ ఈ వెబ్ ఫిల్మ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే..సంగీత్ శోభన్, శాన్వీ మేఘన మధ్య ఉండే అనే ప్రేమ అనే ఎమోషన్‌ను దర్శకుడు ఆవిష్కరించారు. అమ్మాయేమో ధనవంతుల పిల్ల.. కుర్రాడేమో పేదింటి కుర్రాడు. చాటు మాటుగా మాట్లాడుకోవటం, కలుసుకోవటం వంటి పనులు చేస్తుంటారు. అయితే తమ ప్రేమను బతికించుకోవటానికి పారిపోవాలనుకుంటారు. అప్పుడు వారేం చేశారనే కథ ఓ వైపు .. మరో కథలో ఇద్దరు చిన్న పిల్లలకు విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. వారిదేమో పేద కుటుంబం, పల్లెటూరు దాంతో ఎలాగైనా పట్నం వెళ్లి విమానం ఎక్కాలనుకుంటారు. తమ ఊరి నుంచి పారిపోయి పట్నం వచ్చేస్తారు. ఓ వైపు పిల్లలు, మరో వైపు ప్రేమ జంట .. సిటీ వచ్చిన తర్వాత వారి జీవితాలు మలుపు తిరిగే సమస్యలు ఎదురవుతాయి. మరి ఆ సమస్యలను వారు అధిగమించారా? వారి కలలను నేరవేర్చుకున్నారా? అనే విషయం తెలియాలంటే అక్టోబర్ 13న రిలీజ్ కాబోయే ప్రేమ విమానం సినిమా చూడాలని అంటున్నారు మేకర్స్. వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.