'మ్యాడ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీత్ శోభన్.. హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోంది. గతంలో 'కమిటీ కుర్రోళ్లు'తో హిట్ కొట్టిన ఈమె.. అప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆకట్టుకుంది. ఇప్పుడు హారర్ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా 'రాకాస' గ్లింప్స్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: మెగా హీరో పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?)
వీరుడు అని పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి ఎంట్రీ ఇచ్చిన సంగీత్ శోభన్.. ఓ భయంకరమైన ప్లేసులో చిక్కుకుంటాడు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఈ చిత్రంతో మానస శర్మ దర్శకురాలిగా పరిచయమవుతోంది. నయన్ సారిక హీరోయిన్. ఏప్రిల్ 3న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)


