మెగా హీరో సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్? | Mrunal Thakur Special Song Ram Charan Peddi | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: పాన్ ఇండియా మూవీలో స్పెషల్ సాంగ్.. నిజమేనా?

Jan 23 2026 4:47 PM | Updated on Jan 23 2026 4:55 PM

Mrunal Thakur Special Song Ram Charan Peddi

తెలుగులో చేసినవి రెండు మూడు సినిమాలే అయినా మృణాల్ ఠాకుర్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో అయితే ఈమె గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వినిపించాయి. తమిళ హీరో ధనుష్‌ని పెళ్లి చేసుకోనుందని, ఫిబ్రవరి 14న డేట్ కూడా ఫిక్స్ చేశారని అన్నారు. తీరా చూస్తే ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని మృణాల్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. ఈ విషయాలని పక్కనబెడితే ఇప్పుడు మెగా హీరో మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందనే రూమర్ వినబడుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)

ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ 'డకాయిట్‍'లో మృణాల్ హీరోయిన్. మార్చి 19న ఈ మూవీ తెలుగు, హిందీలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో ఓ హిందీ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు రామ్ చరణ్ 'పెద్ది'లోనూ ఈమె స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయనుందనే పుకారు తెగ వైరల్ అవుతోంది. 'జిగేలు రాణి' టైపులో దీన్ని ప్లాన్ చేశారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే. ఒకవేళ నిజమైతే మాత్రం అభిమానులకు పండగే!

మరోవైపు 'పెద్ది' వాయిదా పడనుందనే రూమర్స్ గట్టిగా వినబడుతున్నాయి. లెక్క ప్రకారం అయితే మార్చి 27న పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ వర్క్ పెండింగ్ ఉండటం, మార్చిలోనే 'ధురంధర్ 2' రిలీజ్ కానుండటం తదితర కారణాల వల్ల వాయిదా గ్యారంటీ అని అంటున్నారు. మే లేదా జూన్‌లో 'పెద్ది' థియేటర్లలోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 'పెద్ది' ఈ తేదీన రాకపోతే.. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి వీటిలో ఏదేది నిజమనేది తెలియల్సి ఉంది.

(ఇదీ చదవండి: స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై చీటింగ్ కేసు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement