ఇంతలా భావోద్వేగానికి ఎప్పుడు గురికాలేదు: రష్మిక | Rashmika mandanna Reply to article write On Her Journey up to marriage | Sakshi
Sakshi News home page

Rashmika: ఇంతలా భావోద్వేగానికి ఎప్పుడు గురికాలేదు: రష్మిక

Mar 9 2026 1:24 PM | Updated on Mar 9 2026 1:30 PM

Rashmika mandanna Reply to article write On Her Journey up to marriage

ఇటీవలే విజయ్ దేవరకొండను పెళ్లాడిన హీరోయిన్ రష్మిక తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు స్పందించింది. విజయ్- రష్మిక ప్రేమ, పెళ్లి, వాళ్లద్దరి ప్రయాణం గురించి ఓ కథనం రాసుకొచ్చారు. ఇది చూసిన రష్మిక ఆ ఆర్టికల్‌కు రిప్లై ఇ‍చ్చారు. చాలా రోజులుగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంతగా భావోద్వేగానికి గురి కాలేదని తెలిపింది.

రష్మిక తన ట్వీట్‌లో రాస్తూ..' చాలా కాలంగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంత భావోద్వేగానికి గురి కాలేదు. నేను చెప్పాలనుకున్నది చాలా ఉంది.. కానీ మాటలు రావడం లేదు. ఇప్పుడు నేను ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఆనందంగా ఉన్నా. నా ప్రయాణం గుర్తించినందుకు ధన్యవాదాలు. ప్రేమ గురించి నేను చెప్పగలిగేది ఒక్కటే. మిమ్మల్ని ‍స్వేచ్ఛగా ఉంచే ప్రేమను వెతకండి' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఫిబ్రవరి 26న విజయ్- రష్మిక పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement