'జన నాయగన్‌' రూ. 120 కోట్ల ఢీల్‌ రద్దు | Jana Nayagan OTT Deal 120 cr canceled because of delay | Sakshi
Sakshi News home page

'జన నాయగన్‌'కు భారీ నష్టం‌.. రూ. 120 కోట్ల ఢీల్‌ రద్దు

Mar 12 2026 3:36 PM | Updated on Mar 12 2026 3:50 PM

Jana Nayagan OTT Deal 120 cr canceled because of delay

విజయ్‌  నటిస్తున్న ‘జన నాయగన్‌’కు  సెన్సార్‌ చిక్కులు చిక్కులు తప్పడం లేదు. ముందుగా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో వడ్డీల రూపంలో నిర్మాత వెంకట్‌ కె.నారాయణకు భారీ నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఓటీటీ ఢీల్‌ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో చట్టపరమైన సమస్యలు రావడంతో ఈ సినిమా గత మూడు నెలలుగా ల్యాబ్‌కే పరిమితమైంది.

జన నాయగన్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం సీబీఎఫ్‌సీ రివైజ్‌ కమిటీ మరోసారి సినిమా చూడాల్సి ఉంది. అయితే, ఈ కమిటీలో ఓ సభ్యుడి అనారోగ్య కారణంగా చివరి నిమిషంలో స్క్రీనింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసింది. ఇలా పలు కారణాలతో రివైజ్‌ కమిటీ దాటవేస్తుండటంతో వ్యాపారం పరంగా భారీ నష్టం తప్పడం లేదు. కనీసం ఎప్పుడు చూస్తారో కూడా వారు చెప్పకపోవడంతో విడుదలపై అనిశ్చిత నెలకొంది. దీంతో అమెజాన్‌తో కుదుర్చకున్న ఓటీటీ ఢీల్‌ రూ. 120 కోట్లు రద్దు అయినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే,  ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

విజయ్‌ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో  జన నాయగన్‌ చివరి సినిమా అని ప్రకటించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్‌ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా యాక్ట్‌ చేస్తున్నారు. కేవీఎన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాపై బాక్సాఫీస్‌ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement