
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో ఆకట్టుకున్న నటుడు సంగీత్ శోభన్. ఇతడు ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న ఓ మూవీలో హీరోగా లీడ్ రోల్ చేస్తున్నాడు. అయితే ఇతడు నటించిన ఓ చిత్రం ఇదే ఏడాది మరొకటి రిలీజైందని తెలుసా? అవునా ఏ సినిమా అది అని ఆశ్చర్యపోతున్నారా? అదే ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?
(ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్ షికార్లు)
డైరెక్టర్ శోభన్‌కి ఇద్దరు కొడుకులు. పెద్దోడు సంతోష్ శోభన్ ఇదివరకే తెలుగులో ఆడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. చిన్నోడు సంగీత్ శోభన్ మాత్రం తొలుత ఓ వెబ్ సిరీస్ చేశాడు. తర్వాత 'మ్యాడ్' రెండు చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో 'గ్యాంబ్లర్స్' అనే మూవీ చేశాడు. జూన్ 6న థియేటర్లలోకి కూడా వచ్చింది. కానీ కంటెంట్‌పైన నమ్మకం లేదో ఏమో గానీ ప్రమోషన్స్ చేయలేదు. దీంతో మూవీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.
ఇప్పుడు ఈ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఆగస్టు 14 అంటే ఈ గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 'గ్యాంబ్లర్స్' విషయానికొస్తే.. కార్డ్ క్యాజిల్ క్లబ్‌లో చాలామంది పేకాట ఆడుతుంటారు. ఆంటోని(మధుసూధనరావు) అలానే ఆడి తన వంశ గౌరవమైన లేడీ బర్డ్ అనే డైమండ్ కోల్పోతాడు. ఆ లేడీ బర్డ్ తర్వాత మిస్ అవుతుంది. దీంతో ఆంటోని కొడుకు ఏంజిల్ (సంగీత్ శోభన్)ని చిదంబరం (శ్రీకాంత్ అయ్యంగర్) తన చెప్పచేతుల్లో పెట్టుకుంటాడు. ఇంతకీ కార్డ్ క్యాజిల్ క్లబ్ సంగతేంటి? ఆ డైమండ్ కథేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ధనుష్‌తో డేటింగ్? ఎట్టకేలకు స్పందించిన మృణాల్)