
సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు లైట్ తీసుకునేలా ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం నిజమేనేమో అనిపిస్తాయి. కొన్నిరోజుల క్రితం అలా.. ధనుష్-మృణాల్ డేటింగ్‌లో ఉన్నారనే ఓ రూమర్ అందరి దృష్టిని ఆకర్షించించింది. ఒకటి రెండు వీడియోలు కూడా వైరల్ కావడంతో ఇది నిజమేనని అందరూ అనుకున్నారు.
అయితే ఈ డేటింగ్ పుకార్లకు బలం చేకూర్చేలా కొన్ని విషయాలు కనిపించాయి. ధనుష్ ప్రస్తుతం భార్య నుంచి విడాకులు తీసుకుని సింగిల్‌గానే ఉంటున్నాడు. అలాంటిది మృణాల్.. రీసెంట్‌గా జరిగిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో ధనుష్‌తో చనువుగా కనిపించడం, అలానే ధనుష్ అక్కలు ఇద్దర్ని ఇన్ స్టాలో మృణాల్ ఫాలో అవుతుండటం లాంటివి చూసి డేటింగ్ నిజమని అందరూ భావించారు.
(ఇదీ చదవండి: చెప్పడం మర్చిపోయాను.. క్షమించండి: ఎన్టీఆర్)
ఇప్పుడు ఈ విషయమై స్వయంగా మృణాల్ ఠాకుర్ స్పందించింది. అసలెం జరిగిందో చెప్పుకొచ్చింది. 'ధనుష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఈ రూమర్స్ గురించి నాకు కూడా తెలుసు. నిజం చెప్పాలంటే అవి చాలా ఫన్నీగా అనిపించాయి. 'సన్ ఆఫ్ సర్దార్ 2' ఈవెంట్‌కి ఆయన రావడాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ధనుష్-అజయ్ దేవగణ్ క్లోజ్ ఫ్రెండ్స్. అజయ్ పిలిస్తేనే ధనుష్.. ఆ కార్యక్రమానికి వచ్చాడు. మా ఇద్దరం కలిసి కనిపించినంత మాత్రాన మా మధ్య ఏదో జరుగుతున్నట్లు కాదు' అని మృణాల్ చెప్పుకొచ్చింది.
సీరియల్స్ నుంచి సినిమా హీరోయిన్‌గా మారిన మృణాల్.. 'సీతారామం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'హాయ్ నాన్న'తో మరో సక్సెస్ అందుకుంది. కానీ విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' ఫ్లాప్ అయింది. అప్పటినుంచి హిందీలోనే వరస సినిమాలు చేస్తోంది. కానీ అన్నీ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. లేటెస్ట్‌గా వచ్చిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' కూడా ఫ్లాప్ అయింది.
(ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్ షికార్లు)